రెట్రాస్పెక్టివ్‌ టాక్స్‌ తొలగింపు మంచి పరిణామం 

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి 

న్యూఢిల్లీ : రెట్రాస్పెక్టివ్‌ టాక్స్‌ తొలగింపు మంచి పరిణామమ‌ని వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.  టాక్సేషన్‌ చట్టాల (సవరణ) బిల్లుపై సోమ‌వారం రాజ్యసభలో జరిగిన చర్చలో విజయసాయి రెడ్డి మాట్లాడారు. ఈ బిల్లు ద్వారా వెనుకటి తేదీ నుంచి పన్ను చెల్లించాలన్న నిబంధన తొలగిపోతుంది. తద్వారా అంతర్జాతీయ లిటిగేషన్లకు ఆస్కారం ఉండదు. మనపై విదేశీ కంపెనీల విశ్వాసం పెరగడంతోపాటు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ మరింత సులభతరం అవుతుందని చెబుతూ ఈ బిల్లుకు వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతను ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top