విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్ ఏర్పాటు ఖాయం

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌:   విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌ను ఏర్పాటు చేయ‌డం ఖాయ‌మైంద‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ నేత వి.విజ‌య‌సాయిరెడ్డి స్ప‌ష్టం చేశారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిట‌ల్‌కు త‌గ్గ‌ట్టు విశాఖ కేంద్రంగా అభివృద్ధి ప‌నులు చేప‌డ‌తున్నామ‌ని చెప్పారు. భూమి విలువ ఆధారంగా ఇంటి ప‌న్ను పెంచ‌డం జ‌రుగుతుంద‌ని తెలిపారు. విశాఖ‌లో భూములు తాక‌ట్టు పెడుతున్నార‌ని ప్ర‌తిప‌క్షాలు దుష్ర్ప‌చారం చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. కేంద్రం నుంచి నిధులు తీసుకొనేట‌ప్పుడు ఆస్తులు గ్యారంటీ చూప‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మ‌న్నారు. జేఎన్ఎన్ యూఆర్ఎం ఇళ్ల మ‌ర‌మ్మ‌తుల‌కు ఒక్కో ఇంటికి రూ.10 వేలు కేటాయిస్తున్నామ‌ని తెలిపారు.విశాఖ‌లో మొత్తం 8 క‌న్వేన్ష‌న్ సెంట‌ర్లు నిర్మిస్తున్నామ‌ని వెల్ల‌డించారు.విశాఖ‌లో తాగునీటి స‌మ‌స్య లేకుండా రూ.500 కోట్ల‌తో అభివృద్ధి ప్ర‌ణాళిక రూపొందించామ‌ని విజ‌య‌సాయిరెడ్డి వెల్ల‌డించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top