సిద్దం సభలతో అమాంతం పెరిగిన వైయ‌స్ఆర్‌సీపీ గ్రాఫ్

నాయకులు, కార్యకర్తలకు మరింత ఉత్సాహాన్నిస్తున్న  సిద్ధం సభలు

ప్రజల నుంచి విశేష ఆదరణ

15 లక్షల మందితో చరిత్ర సృష్టించనున్న చివరి సిద్దం మహాసభ

త్వరలో మేనిఫెస్టో  విడుదల

నెల్లూరు సమన్వయకర్తగా నియమించినందుకు సిఎంగారి ధన్యవాదాలు

సిద్ధం పోస్టర్, ప్రచార పాట ఆవిష్కరించిన రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయి రెడ్డి

ఒంగోలు : సిద్దం సభలకు ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోందని, దీంతో వైయ‌స్ఆర్‌సీపీ గ్రాఫ్ అమాంతం పెరిగిందని వైయ‌స్ఆర్‌సీపీ  రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు, నెల్లూరు ఎంపీ అభ్యర్థి  వి విజయసాయి రెడ్డి అన్నారు. ఒంగోలులోని ఓ ఫంక్షన్ హాల్లో శనివారం నాడు  సిద్ధం సభ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు.అనంతరం సిద్ధం పోస్టర్ ఆవిష్కరించారు. అలాగే ప్రచారం పాటను కూడా విడుదల చేశారు.  అనంతరం మీడియాతో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... సిద్ధం సభలకు ముందు, సిద్ధం సభల అనంతరం నిర్వహించిన సర్వేలు వైయ‌స్ఆర్‌సీపీ  గ్రాఫ్ అమాంతం పెరిగినట్లు పేర్కొన్నాయని తెలిపారు. 

సిద్ధం సభలకు ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చూస్తే ఎన్నికల్లో 175 కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 పార్లమెంటు సీట్లు గెలుస్తామని నమ్మకం మరింత బలపడుతోందని అన్నారు. ఈ నెల 10న బాపట్ల జిల్లా  అద్దంకి నియోజకవర్గంలో మేదరమెట్ల వద్ద చివరిది నాల్గవ సిద్దం మహా సభ జరగనుందని,ఈ  సభకు తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలోని మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

సభకు హాజరైన వారికి భోజనం, తాగునీరు, మజ్జిగ, పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తున్నట్లు  తెలిపారు. ఇప్పటి వరకు బీమిలి, ఏలూరు, రాప్తాడు సిద్ధం సభలకు ఒకదానికి మించి మరో సభకు ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారని వివరించారు. గడిచిన నాలుగు సంవత్సరాల 10 నెలల కాలంలో ప్రజలకు ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఏమి చేశామన్న దానిపై ముఖ్యమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారని అలాగే రానున్న 5 సంవత్సారాల్లో ప్రజలకు మరింత మంచి పాలన ఏ విధంగా అందిస్తామన్న దానిపై, మేనిఫెస్టోలో ఏఏ అంశాలు పొందుపరుస్తున్నారన్న విషయాలను సభలో సీఎం జగన్ దిశానిర్దేశం చేస్తారని అన్నారు. 

మేనిఫెస్టో తయారవుతోందని త్వరలో విడుదల చేస్తారని అన్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తారని అన్నారు. చివరి సిద్ధం మహా సభ ముగిసిన అనంతరం ఎన్నికల పర్వం మెదలవుతుంది. మార్చి 13, 14 తేదీల్లో ఎన్నికల ప్రకటన రానున్నట్టు భావిస్తున్నామని అన్నారు. సిద్దం సభ 100 ఎకరాల స్థలంలో నిర్వహిస్తున్ననట్లు అవసరమైతే ప్రక్కనున్న మరో 100 ఎకరాలు కూడా వినియోగించుకుంటామని అన్నారు. సిద్దం మహాసభ అనంతరం  వీలైనన్ని నియోజక వర్గాలు కవర్ చేసే విధంగా ఎన్నికల ప్రచారా సభలు నిర్వహిస్తామనన్నారు. 

గతంలో బీసీల అభివృద్ధికి వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో ప్రజలందరికీ తెలుసని, వారిని సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా జగన్ ప్రభుత్వం అందించిన చేయూత ఎవ్వరూ మర్చిపోలేదని అన్నారు. అనుకున్న టార్గెట్ తప్పక చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 

బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ సీఎం వైయ‌స్ జగన్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న సిద్ధం సభలకు విశేష ఆదరణ లభిస్తోందని, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పరిశీలకుల సమన్వయంతో పనిచేసి విజయం సాధిస్తామని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కలిసినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఏ మాత్రం ప్రభావం చూపదని అన్నారు. 

అంతకుముందు పైన పేర్కొన్న 6 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పరీశీలకులకు మేదరమెట్ల సిద్దం సభకు సన్నాహక సమావేశంలో ఎంపి విజయసాయిరెడ్డి  దిశానిర్దేశం చేశారు. 

15 లక్షల మంది హాజరుకానున్న సభలో ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అన్నారు. అనంతరం నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, పరిశీలకుల అభిప్రాయలను అడిగి తెలుసుకున్నారు.. అలాగే తనపై నమ్మకంతో నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. 

అంతకు ముందు నెల్లూరు, ప్రకాశం జిల్లాల పార్టీ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలినెని శ్రీనివాస్ రెడ్డి, మేరుగు నాగార్జున, మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు తదితరులు సభలో పాల్గొన్న వారికి పలు సూచనలు, సలహాలు అందించారు. కార్యక్రమంలో రీజనల్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రులు మేరుగు నాగార్జున, కాకాని గోవర్ధనరెడ్డి,అంబటి రాంబాబు, ఆదిమూలపు సురేష్, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు,లోక్ సభ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి, గురుమూర్తి, తలశిల రఘురాం, లేళ్ల అప్పీరెడ్డి,విజయనగరం జెడ్పి చైర్మన్ మజ్జీ శ్రీనివాసరావు,తిరుపతి జిల్లా పార్టీ అధ్యక్షుడు నేదురుమల్లి రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు  
 

Back to Top