తుమ్మితే..దగ్గితే అధికారం ఎలా కోల్పోతుందో చెప్పు బాబూ?

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి సూటి ప్ర‌శ్న‌

అమ‌రావ‌తి: తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడుకు తన ‘సొంత నియోజకవర్గం’ కుప్పంలో నిరసనలు ఎదురవ్వగానే సీఎం వైయ‌స్‌ జగన్ మోహన్‌ రెడ్డి గారి పులివెందుల గుర్తుకొస్తుంది. అంతటితో ఆగకుండా ఆంధ్రప్రదేశ్‌లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీది ‘తుమ్మితే ఊడిపోయే ముక్కు’ అంటూ అడ్డదిడ్డంగా, ఏ లాజిక్కుకు అందని భాషలో మాట్లాడతారు 72 ఏళ్ల ఈ సీనియర్‌ రాజకీయవేత్త. రాజ్యాంగబద్ధంగా అసెంబ్లీలో మున్నెన్నడూ లేని మెజారిటీతో ఐదేళ్ల పదవీకాలానికి ఎన్నికైన పాలకపక్షం తుమ్మితే, దగ్గితే ఎలా అధికారం ఎలా కోల్పోతుందో చంద్రబాబు కాస్త వివరంగా సెలవిస్తే ఆంధ్రులు సంతోషిస్తారు. తాను సీఎంగా ఉన్నప్పుడు, విపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా తన పర్యటనల్లో ప్రజాగ్రహం ఎదురైతే–ఇలా మతి కోల్పోయి మాట్లాడం ఆయనకు అలవాటే. ఇలాంటి మాటలతో ఆయన తెలుగు విశాల సమాజానికి ఎలాంటి ‘సందేశం’ ఇస్తున్నారని అనుకోవాలి? తాను పుట్టి పెరిగిన, కేజీ నుంచి పీజీ దాకా చదువుకున్న చిత్తూరు జిల్లాలో, కుప్పం నియోజకర్గంలో చంద్రబాబు వంటి రాజకీయ కురువృద్ధుడు హాయిగా తిరగాలి. ఆయన జనంతో ముచ్చటిస్తూ, వారి బాగోగులు వాకబు చేస్తూ వారితో మమేకం కావాలి. అంతేగాని, సంయమనం కోల్పోయి రెచ్చిపోతే 39 ఏళ్ల వయసులోనూ రాజకీయంగా ఇంకా ‘ముక్కు పచ్చలారని’ లోకేష్‌ బాబు తండ్రి వాటం చూసి రాష్ట్ర సర్కారుపై మరింత బిగ్గరగా రంకెలేసే ప్రమాదం లేదా? బాబు గారి మాటలు చూస్తుంటే–ఉమ్మడి ఏపీకి, విభజిత ఆంధ్రకు ముఖ్యమంత్రిగా పనిచేసింది ఈ ‘బాలచంద్రుడు’ గారేనా? అనే అనుమానం చిన్న పిల్లాడికి కూడా వస్తుంది. నారా వారు సహనం, విజ్ఞత కోల్పోకుండా మాట్లాడితే జనం మెచ్చుకుంటారు. అంతేగాని, తుమ్ములు, దగ్గులూ అంటూ హేతుబద్ధం కాని విమర్శలకు తెగబడితే ఆయనకే చేటు. వచ్చే ఎన్నికల్లో పాలకపక్షానికి ఒక్క సీటూ రాదూ, పులివెందులలోనూ ఎదురుదెబ్బలు తప్పవు అంటూ నోరు పారేసుకుంటే తెలుగుదేశం నేత ఎప్పటికీ జనామోదం పొందలేరు.

Back to Top