వంచన, వెన్నుపోటుకు పుట్టిన ఉన్మాది.. చంద్రబాబు

 వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలపై చంద్రబాబుకు ఎందుకు కక్ష?

లోకేష్‌ను కనీసం ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు

నారా అంటే నాసిరకం రాజకీయ నాయకుడు

చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి

కిక్ బాబు..సేవ్‌ ఏపీ ఇదే వైయస్‌ఆర్‌సీపీ నినాదం

 తాడేపల్లి: వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అభివర్ణించారు. మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన ఉన్మాది చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత కూడా లేని చంద్రబాబును రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కొడాలి నానితో కలిసి విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..విజయసాయిరెడ్డి  మాటల్లోనే.. 

ఆ రెండింటికీ పుట్టిన ఉన్మాది:
    చంద్రబాబునాయుడు తల్లిదండ్రులు ఎవరనే విషయం తెలుసుకోవాలి. వంచన అనే తండ్రికి, వెన్నుపోటు అనే తల్లికి పుట్టిన ఉన్మాది చంద్రబాబునాయుడు. అంటే వంచన, వెన్నుపోటు రెండింటికి పుట్టిన బిడ్డ  ఉన్మాది చంద్రబాబు. అలాంటి చంద్రబాబు మా సీఎంగారిని ఉన్మాది అంటున్నాడు. నిజానికి ఆ ఉన్మాదితనంతోనే తనకు పిల్లనిచ్చిన మామకు వెన్నుపోటు పొడిచి, మనోవేదనకు గురి చేసి ఆయన మరణానికి కారణమయ్యాడు చంద్రబాబు. ఇది అందరికీ తెలుసు.

చంద్రబాబుకూ తప్పదు:
    ఎన్టీ రామారావును ఆయన 73వ ఏట చంద్రబాబు వెన్నుపోటు పొడిచాడు ఉన్మాది బాబు. ఇప్పుడు ఉన్మాది బాబుకు 72 ఏళ్లు. అంటే నాకు తెలిసి మరో ఏడాదిలో ఉన్మాది చంద్రబాబును ఆయన కొడుకే వెన్నుపోటు పొడుస్తాడనిపిస్తోంది. ఎందుకంటే, చంద్రబాబు తన కుమారుడు లోకేష్‌ను కొడుకుగా గుర్తించడం లేదు. కనీసం ఎమ్మెల్యేగా గెలిపించుకోలేకపోయాడు. ఆయనకు పార్టీలో ప్రాధాన్యత లేదు. విలువ లేదు. అతణ్ని ఒక వ్యక్తిగా ఎవరూ గుర్తించని విధంగా చంద్రబాబు తీసుకొచ్చాడు.

కిక్‌ బాబు. సేవ్‌ ఏపీ:
    ఒక బా«ధ్యత లేని ప్రతిపక్ష నాయకుడు, ఉన్మాది ఉన్నాడంటే అది చంద్రబాబునాయుడే. ప్రతిపక్ష నాయకుడిగా అతడికి ఇక్కడ ఉండే అర్హత లేదు. ఆయన ఎలాగూ ఇక్కడ ఉండడం లేదు కాబట్టి, ఆయనను ఇక్కణ్నుంచి తరిమికొట్టాల్సి ఉంది. అందుకే కిక్‌ బాబు. సేవ్‌ ఏపీ. అన్న నినాదంతో వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళ్తుంది.

అది ఒక శ్రాద్ధ కార్యక్రమం:
    ఇప్పుడు ఒంగోలులో జరుగుతున్నది మహానాడు కాదు. వారు ఏటా మినీ మహానాడు, మహానాడు జరుపుకుంటారు. తన మామ స్థాపించిన పార్టీని, ఆయనకు వెన్నుపోటు పొడిచి, ఆయన మరణానికి కారకుడయ్యాడు. కాబట్టి అది హత్యతో సమానం. 
    అందుకే పార్టీ మహానాడు నిర్వహించడం అంటే, ఆయనకు  (ఎన్టీఆర్‌) ఒక సంవత్సరీకం (తద్దినం) అన్న మాట. అక్కడ పెట్టే ఆహారం కూడా ఒక శ్రాద్ధం. ఎవరైనా చనిపోతే శ్రాద్ధం పెడితే దాన్ని కాకులు వచ్చి తినిపోతాయి.

వారంతా ‘కామారావు’లు:
    అందువల్ల అది మహానాడు కాదు. అది మహాప్రస్థానం. మహా స్మశానం. ఆనాడు రామారావు ఎంతో ఉన్నతాశయంతో 1982లో పార్టీని స్థాపించాడు. ఆయన ఈరోజు లేడు. ఇవాళ ఆ పార్టీలో ఉన్న వారంతా ‘కామారావు’లే. పనికిమాలిన వెధవలంతా కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చి, రాష్ట్రాన్ని పాలించాలని, ఇక్కడ ఉన్న సంపదనంతా కొల్లగొట్టాలన్న ఉద్దేశంతో ఉన్నారు.

‘నాసిరకం రాజకీయనాయకుడు’:
    చివరకు ‘నారా’ అంటే.. నా అంటే నాసి రకం.. రా అంటే రాజకీయ నాయకుడు. అంటే నాసిరకం రాజకీయ నాయకుడు అన్న పేరు చంద్రబాబులోనే ఉంది. అందుకే ఆయన్ను ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి. ఆయనకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండే అర్హత కూడా లేదు కాబట్టి, ఆయనను ఇక్కణ్నుంచి తరిమి కొడితే కానీ, రాష్ట్రానికి భవిష్యత్తు లేదు.
    14 ఏళ్లు సీఎంగా ఉన్న ఉన్మాది చంద్రబాబు ఏం సాధించాడు?. రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేశాడన్నది చెప్పమనండి. తన హయాంలో ఒక్క ప్రాజెక్టు తెచ్చాను. పూర్తి చేశాను అని మనస్ఫూర్తిగా ఉన్మాది చంద్రబాబును చెప్పమనండి. 

3 వేల మంది కూడా రారు:
    రేపు మహానాడుకు 3 లక్షల మంది వస్తారని చంద్రబాబు చెబుతున్నాడు. అయితే 30 వేల మంది కూడా రారు. వారిని తరలించేందుకు ప్రైవేటు వాహనాల కోసం ఒక ఆఫీసర్‌ సహాయం తీసుకుంటున్నాడు. అయినా సరే 3 వేలకు మించి రాకపోవచ్చు.
    మహానాడుకు రాకుండా పోలీసులు ఎవరినీ అడ్డుకోవడం లేదు. ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఒక శ్రాద్ధం. అందుకే ఎవరూ రారు. ఆయనకు బాగా సన్నిహితంగా ఉన్న ఒక 3 వేల మంది రావొచ్చు.

కోపం. కక్ష సా«ధింపు:
    చంద్రబాబు నీకు మీ మాజీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి మీద కోపం ఉండొచ్చు. ఆయన మీద ఉన్న కోపాన్ని ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మీద చూపిస్తున్నావు. వారిని ఎందుకు శతృవుగా పరిగణించి కక్ష సా«ధిస్తున్నావు.
    కక్ష సాధింపు అనేది చంద్రబాబుకు పుట్టుకతో వచ్చిన గుణం. అందుకే మామకు వెన్నుపోటు పొడిచాడు. మాధవరెడ్డిని హత్య చేయించాడు. ఇంకా చాలా హత్యలు చేయించాడు. అదే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మీద కక్ష సాధిస్తున్నాడు. అందుకే ఇటీవలే అమలాపురంలో వారి ఇళ్లు తగలబెట్టించాడు.

జగన్‌గారిది సుపరిపాలన:
    సీఎం శ్రీ వైయస్‌ జగన్‌కు పరిపాలన చేతకాదని ఉన్మాది చెప్పడం ఏమిటండి? జగన్‌గారి పరిపాలనలో అన్ని వర్గాల వారు ఎంతో సంతోషంగా ఉన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో ఎంతో అభివృద్ధి చెందుతోంది. అలాగే సామాజిక న్యాయం కూడా. 
    ఒక్కసారి క్యాబినెట్‌ సభ్యులు. డిప్యూటీ సీఎంలు. ఎన్నిక కాబడిన పదవులు, నామినేటెడ్‌ పదవులు చూడండి. అన్నింటిలో కనీసం 70 నుంచి 75 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఇచ్చాం అని శ్రీ వి.విజయసాయిరెడ్డి వివరించారు.

తాజా వీడియోలు

Back to Top