కుప్పం ఓటమితో చంద్రబాబు రాజకీయ జీవితానికి శుభం కార్డు పడింది 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి  

 చంద్రబాబుకు అమావాస్య అయితే.. రాష్ట్రానికి పౌర్ణమి 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా... చివరికి కుప్పంలో కూడా పార్టీ లేదు, బొక్కా లేదు

సొంత నియోజకవర్గం ప్రజలు తిరస్కరించినా రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే... అది చంద్రబాబు ఇష్టం

72 ఏళ్ళ చంద్రబాబుకు ఉన్న  బాధ అంతా తన కొడుకు అక్కరకు రాలేదన్నదే 

2019 మంగళగిరిలో లోకేశ్‌ 2021 కుప్పంలో చంద్రబాబును ప్రజలు తిరస్కరించారు

కాలర్ ఎగరేసి బూతులు తిడితే ఓట్లు రావు. ప్రజాప్రయోజనాలు కాపాడితే ఓట్లేస్తారు

లోకేశ్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరుతున్నా

మా విజయాలకు శ్రీ  వైయ‌స్ జగన్ గారి పాలనే కారణం

తాడేప‌ల్లి: కుప్పం ఓటమితో చంద్రబాబు రాజకీయ జీవితానికి శుభం కార్డు పడిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి  పేర్కొన్నారు.  రాష్ట్రంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఫలితాలు, ఉప ఎన్నికల ఫలితాల్లో వైయస్‌ఆర్‌సీపీని రాష్ట్ర ప్రజలు అద్భుతమైన విజయాలను అందిస్తూ.. ప్రభుత్వ పనితీరుకు ఓట్లేసి ఆశీర్వదించారని  అన్నారు. ఏపీ పరిషత్ పోరులో 638 జడ్పీటీసీలకు ఎన్నికలు జరిగితే 628 స్థానాలు వైయస్‌ఆర్‌సీపీ గెలుచుకోవటం జరిగింది. ఎంపీటీసీలకు 9583 స్థానాలకు ఎన్నికలు జరిగితే 8215 స్థానాలు వైయస్‌ఆర్‌సీపీ గెలుచుకోవటం జరిగిందని  జయసాయిరెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లాలో దర్శి మున్సిపాలిటీ తప్ప మిగిలిన వాటిని వైయస్‌ఆర్‌సీపీ కైవసం చేసుకోవటం జరిగిందన్నారు. 

ఎన్నికల్లో ఓడిన ప్రతిసారీ.. ఏదో ఒక సాకు చెప్పడం బాబుకు అలవాటు
ఈ తీర్పు 2024 ఎన్నికలకు చిహ్నమని గతంలోనే చెబుతూ వచ్చామని శ్రీ విజయసాయిరెడ్డి తెలిపారు. 2014 చంద్రబాబు పాలనలో సొంత కొడుకు ఓడిపోయాడు. ఇప్పుడు 2021లో సొంత నియోజకవర్గం కుప్పం పోగొట్టుకున్నారు. దీనిబట్టి టీడీపీ ఫినిష్ అయిపోతోందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. చంద్రబాబుకు గ్రహణం పట్టిందని రాష్ట్రానికి కార్తీక పౌర్ణమిగా భావిస్తున్నాం. ఇకపై హైదరాబాద్‌లో ప్రవాసాంధ్రుడిలా చంద్రబాబు విశ్రాంతి తీసుకోవచ్చని శ్రీ విజయసాయిరెడ్డి అన్నారు. అప్పుడు హైదరాబాదులో రామోజీ రావును, రాధాకృష్ణను రోజూ కలుసుకోవచ్చు.. చర్చించి భవిష్యత్తు ఏంటి అన్నది బాబు నిర్ధారించుకోవచ్చన్నారు. ఈ ఎన్నికలతో చంద్రబాబు రాజకీయ జీవితానికి తెరపడిందనటంలో ఎలాంటి సందేహం లేదన్నారు. చంద్రబాబు ఎన్ని వ్యవస్థలను అయినా మేనేజ్ చేయవచ్చు కానీ ప్రజాన్యాయస్థానంలో మాత్రం తనకు ఓటమి తప్పదనే విషయం గమనించుకోవాలి. 40 ఏళ్ల అనుభవం అని, 14 ఏళ్లు సీఎం అని చంద్రబాబు చెప్పుకుంటాడు. మంచి చేయకపోతే సొంత నియోజకవర్గంలోనూ ప్రజలు ఓడిస్తారని చంద్రబాబు గమనించుకోవాలి. 

ఎల్లో మీడియా ద్వారా అబద్ధపు ప్రచారం మానుకోండి
గ్రామీణ, పట్టణ ఓటర్లు సైతం వైయస్‌ఆర్‌సీపీ వైపే
ఇంతకుముందు గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాబును ఓడించారు. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అర్బన్ ఓటర్లు కూడా వైయస్‌ఆర్‌సీపీ తరుపునే ఉన్నారు. గ్రామీణ, అర్బన్ ప్రాంత ఓటర్లు వైయస్‌ఆర్‌సీపీతోనే ఉన్నారని ఎంతో స్పష్టంగా తెలుస్తోందన్నారు. రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు అయినా.. పరిపాలన ప్రారంభించి రెండున్నరేళ్లు అయినా ప్రజారంజకంగా శ్రీ జగన్ పరిపాలన సాగిస్తున్నారు. రాబోయే రెండు దశాబ్ధాల పాటు శ్రీ జగనే పరిపాలిస్తారని ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిబింభిస్తున్నాయి. ఇంతవరకు వైయస్‌ఆర్‌సీపీ మీద, శ్రీ జగన్ గారిపై ఏ రకంగా చంద్రబాబు దుష్పప్రచారం చేశారు. ఇప్పుడు ఈటీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, మహాటీవీ, టీవీ5కి ఓ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపై కూడా విశ్లేషకులతో టాక్‌ షోలు నిర్వహించాలి. ఎల్లో మీడియా చేసిన అబద్ధపు ప్రచారం వల్లనే చంద్రబాబు ఓడిపోయారు. సంక్షేమ పథకాలు ఆపేదానికి చంద్రబాబు స్టేలు తెస్తాడు. స్టేలు తెచ్చే ప్రయత్నాల్ని ప్రజాప్రయోజనాల కోసం దృష్టి పెట్టినట్లైతే ఈ రకంగా ఘోరంగా ఓడిపోయేవారు కాదని విజయసాయిరెడ్డి అన్నారు.

పెద్దలపై అనుచిత వ్యాఖ్యలు మానుకో లోకేశ్‌
లోకేశ్‌పై చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరుతున్నా
మొన్న లోకేశ్‌ 11 కేసులు తనపై ఉన్నాయని సెక్షన్ 307 కూడా పెట్టారని ఏం పీక్కుంటారని అడుగుతున్నాడు. ఏదైనా కేసు ఉంటే.. 48 గంటల్లోనే స్టే తీసుకువస్తానని అంటున్నాడు. ఇది న్యాయ వ్యవస్థను కించపరచటం కాదా? గౌరవ న్యాయస్థానాన్ని నివేదించుకుంటున్నాను. కంటెప్ట్ యాక్ట్ కింద లోకేశ్‌ మీద పెట్టి శిక్షించాలని హైకోర్టును నివేదించుకుంటున్నాను. న్యాయవ్యవస్థను ఎవ్వరూ కించపరచకూడదు. 48 గంటల్లోనే స్టే తీసుకువస్తానని లోకేశ్ ప్రచారం చేస్తున్నారు. 

ఈసారి తండ్రీకొడుకులిద్దరూ సీటు మారాల్సిందే
72 ఏళ్ళ చంద్రబాబుకు ఉన్న  బాధ అంతా తన కొడుకు అక్కరకు రాలేదన్నదే 
మంగళగిరి పోయింది. కుప్పం పోయింది. తండ్రికి సీటు లేదు. కొడుకు సీటు లేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇద్దరూ సీట్లు మారాల్సిందనని విజయసాయిరెడ్డి అన్నారు. 72 ఏళ్లున్న చంద్రబాబుకు తన కొడుకు దేనికీ పనికిరాకుండా పోయాడన్న మనస్తాపం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. సీఎం శ్రీ జగన్ తండ్రికి మించిన తనయుడుగా పేరు తెచ్చుకుంటే.. లోకేశ్‌ మాత్రం తండ్రిని ముంచిన తనయుడనే పేరు తెచ్చుకున్నారు. దీనిబట్టి ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో అందరూ చంద్రబాబుకు బైబై చెప్పారు. అయినా చంద్రబాబు ఏదో కుప్పంలో గెలిచారు. ఇప్పుడు ఎమ్మెల్యే సీటు కిందకే ప్రజలు నీళ్లు తెచ్చారు. 

కాలర్ ఎగరేసి బూతులు తిడితే ఓట్లు రావు. ప్రజాప్రయోజనాలు కాపాడితే ఓట్లేస్తారు
ఏం పీక్కుంటారంటే.. ప్రజలు కుప్పం పీసేకుంటామన్నారు
కారుపై నిలబడి కాలర్‌ ఎగరేస్తూ బూట్లు తిడితే సీట్లు రావు. ప్రజాప్రయోజనాలు కాపాడితే.. అప్పుడే ఓట్లు వేస్తారని శ్రీ విజయసాయిరెడ్డి అన్నారు. హీరోను అన్న రీతిలో ప్రదర్శిస్తే ఉన్న సీట్లు కూడా ఊడిపోతాయన్న విషయం గమనించుకోవాలి. ఇటీవల లోకేశ్‌ శర్మ అనే సోషల్ మీడియా సలహాదారుడును పెట్టుకున్నారు. నోరు తెరిస్తే బూతులు. నోరు తెరిస్తే అన్‌ పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు. పెద్ద, చిన్న అనే తారతమ్యం, గౌరవం లోకేశ్‌కు లేదన్నారు. ఈ రకమైన భాష మాట్లాడితే.. ప్రజలు ఏరకమైన తీర్పు ఇస్తారో ఈ ఎన్నికల్లో తెలుస్తోందన్నారు. ఏం పీక్కుంటారు... మీరు అని లోకేశ్‌ అంటే.. కుప్పం పీసేకుంటామని ప్రజలు అన్నారు. 

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పినట్టుగా... చివరికి కుప్పంలో కూడా పార్టీ లేదు, బొక్కా లేదు
గతంలో కొంతకాలం క్రితం టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పార్టీలేదు.. బొక్క లేదు అన్నారు. ఈరోజు కుప్పం ఎన్నికల తర్వాత అచ్చెన్నాయుడు అన్నది నిజమే అని సంతృప్తి పొందుతున్నాను. అచ్చెన్నాయుడు కరెక్టుగా అంచనా వేశారు. గతంలో పోలవరం సందర్భంగా జయము జయము చంద్రన్న అని పాట పాడించారు.. ఇప్పుడు సెలవు సెలవు చంద్రబాబు అని పాట పాడారు. వారికీ డబ్బులిస్తావా చంద్రబాబు. మొన్న తిరుపతికి వచ్చిన సందర్భంగా కేంద్ర హోంశాఖ మాత్యులు అమిత్‌షా టీడీపీ ఒక ముగిసిన అధ్యాయమని చెప్పారు. ఇది నూటికి నూరు శాతం నిజమే అనిపిస్తోంది. ఇవన్నీ చూస్తే.. భవిష్యత్తులో టీడీపీ అంతర్థానమైపోతుందని తెలుస్తుంది. చంద్రబాబు ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాడు. మేం రెఢీగా ఉన్నామని పొత్తుకు రండని విజ్ఞప్తులు చేస్తున్నారు. ఎవ్వరూ ముందుకు రావటం లేదు. ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారు. భవిష్యత్తులో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేదానికి అర్హత లేదు. 

చంద్రబాబు ఏదీ సక్రమంగా చేయడు అన్నీ అక్రమమే
ఇప్పుడు అక్రమంగా కట్టిన ఇంట్లో చంద్రబాబు నివసించటమే కాదు.. అంతా అక్రమమే ఏదీ సక్రమంగా చేయడని విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవస్థలను మేనేజ్ చేయటం, అబద్ధాలు చెప్పటం, అన్యాయం చేయటం, అవినీతి చేయటం, అధర్మాన్ని పాటించడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ధర్మం, న్యాయం, అవినీతిని నిర్మూలించటం మంచి పరిపాలన అందించటం వంటివి సీఎం శ్రీ జగన్ పాటిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. వచ్చే రెండున్నరేళ్లలో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి పథకాలపై వైయస్‌ఆర్‌సీపీ దృష్టి పెడుతుందని శ్రీ విజయసాయిరెడ్డి అన్నారు. రెండు దశాబ్ధాల పాటు మంచి పాలన అందించి ప్రజల మనసులు వైయస్‌ఆర్‌సీపీ చూరగొంటుందని శ్రీ విజయసాయిరెడ్డి అన్నారు. 

మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ..

ఈ విజయాన్ని వినయంతో, విధేయతతో స్వీకరిస్తున్నాం
తర్వాత మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును మేం వినయంగా, విధేయతతో స్వీకరిస్తున్నాం. ఈ తీర్పు అనేది  సీఎం శ్రీ జగన్ గారిపైన, రాష్ట్ర ప్రభుత్వంపై బాధ్యతను పెంచింది. దేశ చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక సర్పంచ్ నుంచి ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎంపీ, సీఎం వరకు ఒకే పార్టీ ఉండటం జరగలేదు. మొట్టమొదటిసారి జరిగింది. ప్రజలు ఒక నమ్మకంతో, విశ్వాసంతో ఈ తీర్పు ఇచ్చారు. ప్రజలు మాపైన మరింత బాధ్యత పెంచారని భావిస్తున్నాం. ఇప్పటికే సీఎం శ్రీ జగన్ పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా పాలించటం వల్లే ప్రజాదరణ పెరిగిందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ తెలిపారు. ఈ రెండున్నరేళ్లలో కోటి 25 లక్షల కుటుంబాలకు రూ.1.30 లక్షల కోట్లు అందజేయటం జరిగింది. అందులో కులం, మతం, పార్టీ అనేది ఎక్కడా చూడలేదు. మొదట్లో సీఎం శ్రీ జగన్ చెప్పింది చాలా మందికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు సీఎం శ్రీ జగన్ విజన్ అందరికీ అర్థమౌతోంది. గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఓటేయని వారు కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో శ్రీ జగన్ గారిని దీవించారన్నారు. ఓటేసిన ఓటర్లకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. 

మూడు ప్రాంతాల అభివృద్ధి వద్దు.. ఒకే ప్రాంతం ముద్దు అని టీడీపీ అనటం సరికాదు
ఇలాగే టీడీపీ వ్యవహరిస్తే 2024లో మూడు సీట్లకే పరిమితం

టీడీపీ ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయకూడదని స్లోగన్ తెచ్చారు. మద్రాస్‌, హైదరాబాద్‌లో ఉండి విడిపోయాం. మళ్లీ 50 ఏళ్ల తర్వాత ప్రత్యేక రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా కావాలనే కోరిక కోరకూడదని మూడు రాజధానులు తెస్తే దాన్ని టీడీపీ అడ్డుకుంటోంది. చంద్రబాబుకు రాజకీయ అనుభవం ఉందని చెబుతారు. ప్రజలు చంద్రబాబుకు మూడు సార్లు అవకాశం ఇచ్చారు. ఇప్పుడు శ్రీ జగన్ గారికి అవకాశం ఇస్తే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు. అడుగడుగునా అభివృద్ధిని చంద్రబాబు అడుగుంటున్నారు. 175 నియోజకవర్గాల్లో ప్రజలు పట్టం కట్టడం అనేది ఎక్కడా జరగలేదు. ఇప్పటికైనా చంద్రబాబు ఆలోచనా ధోరణి మార్చుకుంటే మంచిది. చంద్రబాబుకు రాని మంచి ఆలోచనలు, మంచి పాలనను శ్రీ జగన్ చేస్తున్నారని సీఎంకు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని ఈరకంగా అడ్డుకుందామని అనుకోవటం తెలివితక్కువ తనమని మంత్రి ముత్తంశెట్టి మండిపడ్డారు. ఒక తండ్రి తన బిడ్డను చూసుకుంటున్నట్లు సీఎం శ్రీ జగన్ చూస్తున్నారు కాబట్టే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. సీఎం శ్రీ జగన్ పిలుపే ఒక మంత్రంగా భావిస్తున్నారు. ప్రజలకు, సీఎం శ్రీ జగన్ మంచి అనుబంధం ఏర్పడింది. దాన్ని చంద్రబాబు లాంటి వ్యక్తులు కుట్రలు చేసి తుంచలేరు. నా మతం మానవత్వం.. నా కులం ఇచ్చిన మాటే నిలబెట్టుకోవటం అని సీఎం శ్రీ జగన్ చెబుతుంటారు. ఇచ్చిన హామీలు, ఇవ్వని హామీలతో పాటు 29 పథకాలను సీఎం శ్రీ జగన్ అమలు చేస్తున్నారని మంత్రి ముత్తంశెట్టి తెలిపారు. ఇలాగే చంద్రబాబు వ్యవహరిస్తే 2024లో మూడు సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. 

 
- చంద్రబాబు రాసిన రాజ్యాంగం కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఐదేళ్ల ప్రకారం ఎన్నికలు జరపాలి. చంద్రబాబుకు కల వచ్చి అసెంబ్లీ రద్దు చేయాలంటే వీలు కాదు. ఆయనెవరు నిర్దేశిచంటానికి. ప్రజలు ఐదేళ్లు పరిపాలించాలని తీర్పు ఇచ్చారు. నిజానికి చంద్రబాబు ప్రజల మనసులు దోచుకోగలిగిన శక్తి ఉంటే ఈ ఎన్నికల్లో నిరూపించుకొని ఉండొచ్చు కదా? అసెంబ్లీకే రావాలంటే భయపడే వ్యక్తి.. కొత్తగా వచ్చే అసెంబ్లీలో ఏం సాధిస్తాడు. 

- 100కి 97% సీట్లు మాకు వచ్చాయి. 177లో 97% ఎంతమ్మా. అంటే మా సీట్లు 151 నుంచి 170కి చేరుకోబోతున్నాయని చాలా స్పష్టంగా తెలుస్తోంది. 

- ఎవరు రౌడీయిజం చేస్తున్నారో మీ అందరికీ తెల్సు. ఈ ప్రభుత్వంలో అరాచకం అన్నది లేదు. ప్రతిది కూడా చట్ట ప్రకారం చేస్తున్నాం. డబ్బు ఎక్కడా పంచిన సందర్భం లేదు. ఆ అవకాశమే లేదు. డబ్బు ఖర్చు పెట్టకుండా ఎన్నికలు పెట్టాలని సీఎం శ్రీ జగన్ చేసి చూపారు. ఆ మాట మాట్లాడే అర్హత కూడా చంద్రబాబుకు లేదు.

Back to Top