అందరం కలిసికట్టుగా పని చేస్తాం

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
 

అమరావతి: రాష్ట్ర ప్రయోజనాల కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎన్నికైన లోక్‌సభ, రాజ్యసభ సభ్యులందరం కూడా కలిసికట్టుగా పని చేస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వైయస్‌ఆర్‌సీపీ నుంచి రాజ్యసభలో ఒక్కస్థానంలో ప్రస్థానంతో మొదలై ఈ రోజు ఆ బలం ఆరుకు చేరింది. ఈ ఐదేళ్లలో 11 స్థానాలకు చేరుకుంటుంది. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునే శక్తి పార్టీకి ఉంటుంది. లోక్‌సభ, రాజ్యసభలోని సభ్యులందరం కూడా పార్టీ విధివిధాలకు అనుగుణంగా, పార్టీ అధినేత, సీఎం వైయస్‌ జగన్‌ సూచనల మేరకు కలిసికట్టుగా పని చేస్తామన్నారు. రాజ్యసభకు మరో నలుగురిని పంపించే అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి విజయసాయిరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు.
 

Back to Top