ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును వ్యతిరేకించిన వైయస్‌ఆర్‌సీపీ

న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రవేశపెట్టిన త్రిపుల్‌ తలాక్‌ బిల్లును వైయస్‌ఆర్‌సీపీ వ్యతిరేకించింది. త్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి వ్యతిరేకించారు. బిల్లులో పేర్కొన్న పలు అంశాలను వ్యతిరేకిస్తున్నట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. భర్తను అరెస్టు చేస్తే భార్యకు భరణం ఎవరు చెల్లిస్తారని ప్రశ్నించారు. ట్రిపుల్‌ తలాక్‌ సివిల్‌ కాంట్రాక్ట్‌ కిందకు వస్తుందని చెప్పారు. సివిల్‌ కాంట్రాక్టులో ఉన్న వాటిని క్రిమినల్‌ పనిష్మెంట్‌ ఎలా విధిస్తారని సభలో నిలదీశారు. 
 

Back to Top