స్వర్ణకారులు కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం వైయ‌స్ జగన్ గ్రీన్ సిగ్నల్

కుల గణన తోనే అన్ని కులాలకు సరైన ప్రాతినిధ్యం

కులగణనతో  అగ్రవర్ణాలకు ధీటుగా  బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల  అభివృద్ధి

మంగళగిరిలో చేనేత వస్త్ర సమాదాన్ని ప్రారంభించిన ఎంపి విజయసాయిరెడ్డి

మంగళగిరి:  స్వర్ణకారుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారని రాజ్యసభ సభ్యులు, వైయ‌స్అర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  వి. విజయసాయి రెడ్డి వెల్లడించారు.నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి చిరంజీవి ఈ అంశాన్ని తన దృష్టికి తీసుకురాగా తాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి స్వర్ణకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. 
మంగళగిరిలో చేనేత వస్త్ర వ్యాపారుల కోసం ప్రత్యేకంగా నిర్మించిన డాక్టర్ వైయస్ఆర్ మరియు ప్రగడ కోటయ్య చేనేత వస్త్ర వ్యాపార సముదాయాన్ని రాజ్యసభ సభ్యులు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ  జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రారంభించారు..చేనేత వస్త్ర వ్యాపారుల కోసం ప్రత్యేకంగా 5 కోట్ల యాభై లక్షలతో 40 షాపుల కాంప్లెక్స్ ను  మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించింది.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు మురుగుడు హనుమంతరావు, లేళ్ళ అప్పిరెడ్డి, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు..
ఈ సంధర్బంగా 
విజయసాయిరెడ్డి మాట్లాడుతూ ..చేనేత కార్మికుల అభివృద్ధికి కోటయ్య ఎనలేని కృషి చేశారని, ఆయన సేవలకు గుర్తుగా భవనం నిర్మించడం ఆయన్ను గౌరవించుకోవడమేనని అన్నారు.ఇటీవల మంగళగిరిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ప్రారంభించగా ఇప్పుడు రూ. 5.5 కోట్లతో భవనం నిర్మించడం అభివృద్ధికి వైయ‌స్ జగన్ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను అద్దం పడుతోందని అన్నారు.

నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు రూ. 35 కోట్ల బకాయిలు ఉన్నట్లు నియోజకవర్గ అభ్యర్ది చిరంజీవితో కలిసి తన దృష్టికి తీసుకొచ్చారని, దీన్ని తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా వెంటనే బకాయిలను చెల్లించాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

కులగణన కార్యక్రమాన్ని వైయ‌స్ జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని అన్నారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని ప్రతి కులానికి సరైన న్యాయం జరిగేందుకు, ప్రాధాన్యత కల్పించేందుకు కులగణన తప్పనిసరి అని అన్నారు. గతంలో 1931 నుండి 1951 వరకు అన్ని సామాజిక వర్గాలకు జనాభా ప్రాతిపదికన కుల గణన చేసేవారిని. 1951 తర్వాత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఆధారంగా కుల గణన చేశారని తెలిపారు అయితే ఈ విధమైన కుల గణన వల్ల ఏ సామాజిక వర్గానికి చెందిన వారు ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారన్నది స్పష్టత కొరవడిందని అన్నారు. కేవలం కాస్ట్ సెన్సస్ తోనే అన్ని కులాలకు సరైన న్యాయం జరుగుతుందని అన్నారు. 1956 నుండి 1972 వరకు బీసీలకు  రాజ్యాంగపరమైన పదవుల్లో, పార్లమెంట్ లో, లెజిస్లేచర్ లో పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదని, 1972 తర్వాత కొంత వరకు ప్రాధాన్యత వచ్చిందని అన్నారు. 2009లో వైయ‌స్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత  బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. జనరల్ సీట్లలోనూ బీసీలకు పోటీగా పెట్టి గెలిపించారని అన్నారు.  ఉదాహరణకు ఎస్సీ వర్గానికి చెందిన సర్వే సత్యనారాయణను మల్కజ్ గిరి లో జనరల్ సీట్లో పోటీకి నిలబెట్టి గెలిపించారని అన్నారు. అదేవిధానిన్ని ఏపీలో ఇప్పుడు జగన్ అనుసరిస్తున్నారని అన్నారు. కర్నూలు, అనంతపురం, హిందూపురం, రాజమండ్రిలో బీసీలకు నిలబెట్టి గెలిపించుకున్న ఘనత సీఎం జగన్ దే నని అన్నారు.  ఉత్తరాంధ్రలో అధిక శాతం కులాలు బీసీలుగా ఉన్నారని, వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో స్థిరపడిన వారికి వారి పూర్వీకుల భౌగోళికత ఆధారంగా గతంలో కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయబడేవని, సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం పూర్వీకుల భౌగోళికత ఆధారంగా సర్టిఫికెట్ జారీ చేసే విధానాన్ని తొలగించి వెసులు బాటు కల్పించారని అన్నారు. అన్ని కులాలకు సరైన ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో కులగణనకు ఏడాది కిందటే శ్రీకారం చుట్టారని అన్నారు.
కులగణనతో అన్ని కులాలకు ప్రాధాన్యత కల్పించడంతో పాటు ఆర్థికంగా వెనుకబడిన కులాలకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుందని తెలిపారు. అగ్రవర్ణాలకు ధీటుగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లోని అన్ని కులాలకు సరైన రీతిలో అభివృద్ధి చేయడమే కులగణన ముఖ్య ఉద్దేశమని విజయసాయి రెడ్డి తెలిపారు.  మంగళగిరి అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, ఈ మేరకు సభాముఖంగా హామీ ఇస్తున్నామని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ ప్రాంతంలో తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాలలో మండలాలను మరింతగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు.

తాజా వీడియోలు

Back to Top