వైయ‌స్ జ‌గ‌న్‌ను మ‌ళ్లీ ముఖ్య‌మంత్రిని చేసుకుందాం

మంగళగిరిలో మళ్ళీ పార్టీ జెండాను ఎగురేద్దాం

గంజి చిరంజీవిని గెలిపిద్దాం

మంగళగిరి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో

వైయ‌స్ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్  వి. విజయసాయిరెడ్డి

 తాడేపల్లి : ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంలో  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారు దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలబెట్టారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. అందరికీ సంక్షేమ ఫలాలు  అందిస్తున్న సిఎం గారిని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుందామని ఆయన చెప్పారు..తాడేపల్లిలో సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ పార్టీ కార్యకర్తలు నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ .. 2014, 2019 లో గెలిచిన విధంగానే వచ్చే ఎన్నికల్లో కూడా మంగళగిరిలో పార్టీ జెండాను ఎగరవేయాలని కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. బీసీ అభ్యర్థి గంజి చిరంజీవిని నియోజకవర్గ సమన్వయకర్తగా ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి గారు నియమించారని, ఆయన విజయానికి అందరూ కృషి చేయాలని కోరారు. ఈ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి గెలుపు కోసం కుట్రలు చేయడంతో పాటు, విష ప్రచారాలు మొదలుపెట్టారని దీనిని దీటుగా ఎదుర్కోవాల్సిన బాధ్యత పార్టీ నాయకులు, కార్యకర్తల మీద ఉందని ఆయన చెప్పారు..
 నియోజకవర్గంలో పెద్ద ఎత్తన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు అమలు అయ్యాయని తెలిపారు.ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా పార్టీ ప్రణాళికలను తయారు చెస్తోందని ఆయన చెప్పారు.
బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు ఈ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలివచ్చారని, అందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఈ పది రోజుల్లో సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహించడానికి పార్టీ నిర్ణయం తీసుకుందని దీనిని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు...ఈ సమావేశానికి
మంగళగిరి నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త  గంజీ చిరంజీవి, పార్టీ  రీజనల్ కోఆర్డినేటర్,ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్, ఎమ్మెల్సీ  మురుగుడు హనుమంతరావు, దుగ్గిరాల జడ్పిటిసి  దానబోయిన సంతోష్ కృపారాణి, ఎంపిపి  మేకతోటి అరుణ, నియోజకవర్గ పరిశీలకుడు  రాపాక శ్రీనివాస్, పార్టీ నాయకులు  దొంతిరెడ్డి వేమారెడ్డి, వేణుగోపాలరెడ్డి, చిల్లపల్లి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు..

Back to Top