వైయస్‌ఆర్‌ సీపీ జాబ్‌మేళా ప్రారంభం

లాంఛనంగా ప్రారంభించిన వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి

తిరుపతి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో నిర్వహిస్తున్న జాబ్‌మేళాను వైయస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఎస్వీ యూనివర్సిటీ ఆడిటోరియంలో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్‌మేళాను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. జాబ్‌మేళాకు విశేష స్పందన వస్తుందన్నారు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో దశలవారీగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్టు వివరించారు. వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేష‌న్ చేసుకుని కన్ఫర్మేషన్‌ లెటర్‌ వచ్చినవారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ మెగా జాబ్‌మేళా ద్వారా 25 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్టు చెప్పారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో మెగా జాబ్‌మేళా నేడు, రేపు కొనసాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, ఎమ్మెల్యే వెంకటే గౌడ, వైయస్‌ఆర్‌ సీపీ ముఖ్యనేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to Top