యరపతినేని కోసమే చంద్రబాబు చిల్లర వేషాలు వేస్తున్నాడు

ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ 
 

అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై వైయస్‌ఆర్‌సీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఫైర్‌ అయ్యారు.  గతేడాది తన వాళ్లపై ఐటీ శాఖ, ఈడీ అధికారులు కేసులు పెట్టగానే చంద్రబాబు ‘ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. మోదీని గద్దె దింపుతా’ అని వార్నింగులు ఇచ్చేవాడని విజయసాయిరెడ్డి విమర్శించారు.
ఇప్పుడు యరపతినేని శ్రీనివాసరావు కేసు సీబీఐ చేతికి వెళుతోందని తెలియగానే మళ్లీ చిల్లర వేషాలు మొదలెట్టాడని దుయ్యబట్టారు. పల్నాడులో టీడీపీ హయాంలో జరిగిన అరాచకాలు బయటకు రాకుండా ఎదురుదాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.

Back to Top