మత్య్సకార కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ

విశాఖ: లాక్‌డౌన్‌ కారణంగా ఆకలితో అలమటిస్తున్న మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు వైయస్‌ఆర్‌సీపీ నేతలు ముందుకు వచ్చారు. ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి 700 మత్స్యకార కుటుంబాలకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. విపత్కర పరిస్థితుల్లో పేదలకు అండగా నిలవాలన్న సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పిలుపు మేరకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి పరిస్థితుల్లో మానవతదృక్పథంతో స్పందించాలని కోరారు.

సీఎం వైయస్‌ జగన్‌ ఆశయానికి మీ తోడ్పాటు కావాలి 
అత్యంత సురక్షిత ప్రాంతంగా రాష్ట్రానికి గుర్తింపు తేవాలన్న సీఎం వైయస్‌ జగన్ గారి ఆశయానికి మీ తోడ్పాటు తప్పనిసరి అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. కరోనా సంక్షోభ సమయంలో ఎర్రని ఎండలను లెక్కచేయకుండా ఇంటింటికి వెళ్లి రోగులను గుర్తించే పనిలో ఉన్న ఆశా సిస్టర్లు, కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సేవలు మర్చిపోలేనివని ఆయన ట్వీట్‌ చేశారు. 

Back to Top