ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

రాజ్య‌స‌భ‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి డిమాండ్

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్ల‌మెంట్ ప‌క్ష‌నేత విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని కేంద్రం ఇప్పటికీ అమలు చేయలేదని గుర్తుచేశారు. విభజనతో నష్టపోయిన ఏపీని కేంద్రం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఆంధ్ర‌రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని ప్రణాళిక సంఘం ఎక్కడా చెప్పలేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రైల్వే జోన్‌ కేటాయింపులోనూ ఏపీకి అన్యాయం జరిగిందని, విశాఖకు రైల్వే జోన్‌ ఇస్తానని కేంద్రం మాట తప్పిందన్నారు. 

Back to Top