సాన సతీశ్-చంద్రబాబు సంబంధాలపై కేంద్రం దర్యాప్తు చేయించాలి

విజయసాయిరెడ్డి డిమాండ్ 
 

అమ‌రావ‌తి:  ఇటీవల మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన పారిశ్రామికవేత్త సాన సతీశ్ తో చంద్రబాబు, ఇతర టీడీపీ నేతల సంబంధాలపై కేంద్రం దర్యాప్తు జరపాలని  వైయ‌స్ఆర్ సీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి  డిమాండ్ చేశారు. సాన సతీశ్ అనే వ్యక్తి చిన్న ఉద్యోగం చేసుకునేవాడనీ, ఆయన అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసిపెట్టే స్థాయికి ఎదగడం వెనుక చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. ఈ విషయం అందరికీ తెలుసని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు.

ఈరోజు ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి స్పందిస్తూ..‘మనీలాండరింగ్‌ దళారి సానా సతీశ్‌తో చంద్రబాబు, ఆయన పార్టీ ప్రముఖుల సంబంధాల పైనా కేంద్రం దర్యాప్తుకు ఆదేశించాలి. చిన్న ఉద్యోగం చేసుకునే వ్యక్తి అంతర్జాతీయ ఆర్థిక నేరగాళ్లకు పనులు చేసే పెట్టే స్థాయికి ఎదగడం వెనక ఉన్నది చంద్రబాబే అని అందరికీ తెలుసు’ అని ట్వీట్ చేశారు.
 

తాజా ఫోటోలు

Back to Top