టీడీపీ..అదొక తెలుగు బూతుల పార్టీ

వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

రాష్ట్ర‌ప‌తికి ఫిర్యాదు చేసిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు

రాష్ట్ర పరువు, ప్రతిష్టలను బాబు ఎలా మంటగలుపుతున్నాడో రాష్ట్రపతికి వివరించాం

 సీఎం గారిని ఇంత దారుణంగా మాట్లాడారా అని రాష్ట్రపతి ఆశ్చర్యం వ్యక్తం చేశారు

 టీడీపీ అంతర్థానం కాబోతుంది.. అందుకే బాబు ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు

 ఆ పదాన్ని చంద్రబాబు రాష్ట్రపతికి ఎందుకు చెప్పలేకపోయాడు.?

 ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితుల్లో టీడీపీ లేదు..

 న్యూఢిల్లీ:   టీడీపీది బూత్ క‌ల్చ‌ర‌ని, అదొక తెలుగు బూతుల పార్టీ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మంటగలుపుతూ,  ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై అసభ్య పదజాలంతో వ్యక్తిగత విమర్శలకు పాల్పడుతున్న ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ.. ఈరోజు ఢిల్లీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల బృందం,  పార్లమెంటరీ పార్టీ నాయకుడు  వి. విజయసాయి రెడ్డి నాయకత్వంలో రాష్ట్రతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ను కలిసి వినతపత్రం సమర్పించారు. అనంత‌రం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.  

 

  చంద్రబాబు నాయుడు తన పార్టీ అధికార ప్రతినిధులు, తన పార్టీ నేతల చేత ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రిగారిపైనా నోటితో ఉచ్ఛరించలేని అసభ్యకరమైన, బూతు పదజాలంతో తిట్టించి, తాను తప్పు చేసి, పైగా రాష్ట్రపతిగారిని కలిశారు. చంద్రబాబు చేసిన  తప్పేంటో, ఆయన ఎటువంటి రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడో.. రాష్ట్రపతిగారికి వివరించడానికి ఈరోజు మేం రాష్ట్రపతిగారిని కలిశాం.  

 చంద్రబాబు తన రాజకీయ స్వప్రయోజనాల కోసం ఢిల్లీ వచ్చాడు. తన స్వార్థం కోసం రాష్ట్ర పరువు, ప్రతిష్టలను, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కూడా ఎలా తాకట్టు పెట్టాడో, ఎలా మంటగలిపాడో చూశాం. ఈ విషయాలన్నింటినీ రాష్ట్రపతి గారికి వివరించాం.

   టీడీపీలో బూతు సంస్కృతి వేళ్ళూనుకుపోయింది, ఆ పార్టీలో ఏ ఇద్దరు వ్యక్తులు కలిసినా, వారు మాట్లాడుకునే భాష చూసినా.. వాళ్ళు ఇతరులను సంభోదిస్తూ మాట్లడే భాష చూసినా.. అలవోకగా బూతు పదజాలాన్ని వాడతారు. ఆ పార్టీ  కల్చరే బూతు కల్చర్.  అందుకే అదొక బూతు పార్టీ అంటున్నాం. తెలుగుదేశం పార్టీకి బదులు..  తెలుగు బూతుల పార్టీ అని నామకరణ చేసుకుంటే బాగుంటుంది. 

  టీడీపీ అధికార ప్రతినిధితో చంద్రబాబు మాట్లాడించిన బోషడీకే అనే పదాన్ని రాష్ట్రపతి గారి దగ్గర ఉచ్ఛరించాలంటేనే మాకు చాలా ఇబ్బంది అనిపించింది. అటువంటి పదాలను గౌరవ రాష్ట్రపతిగారికి ఎలా చెప్పాలో చాలా సంకోచించాం. ఆయన అర్థం చేసుకుని, ముఖ్యమంత్రిగారిని ఇంత దారుణంగా  మాట్లాడారా.. అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు తిట్టించిన ఆ పదాన్ని రాష్ట్రపతిగారి దృష్టికిగానీ, మరే ఇతర నేతల దృష్టికి గానీ చంద్రబాబు తీసుకువెళ్ళాడా..? . టీడీపీ అధికార ప్రతినిధి మాట్లాడిన ఆ మాటను రాష్ట్రపతికి చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోయాడు..? 

  శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిగారి నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ విలువలు, విశ్వసనీయత కలిగిన పార్టీ. సంస్కార హీనమైన పార్టీగా తెలుగుదేశం గుర్తింపు పొందింది. 
- తన పార్టీ నేతలు అసభ్యకరంగా బూతులు మాట్లాడినా, వాటిని ఖండించకుండా.. అటువంటి బూతుల నాయకుల సమూహానికి నాయకుడిగా చంద్రబాబు చలామణి అవుతున్నాడంటే.. ఆయన ఎంత  సంస్కార హీనుడో అర్థం చేసుకోవచ్చు.

 తెలుగుదేశం పార్టీలో ఈ స్థాయిలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోవడానికి కారణం.. గత రెండున్నరేళ్ళుగా ప్రతి ఎన్నికల్లోనూ ఘోరాతి ఘోరంగా ఓటమి చవిచూడటమే. దాంతో తమ పార్టీ నేతల చేత బూతులు మాట్లాడించి, ప్రత్యర్థులను రెచ్చగొట్టి, కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టి, దేవాలయాలపైన కూడా రాజకీయం చేసి పబ్బం గడుపుకోవాలన్నదే చంద్రబాబు లక్ష్యం. 

   ఆఖరికి ఈరోజు ఫలితం వచ్చిన బద్వేలు ఉప ఎన్నికలోనూ వైయస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికలో పోటీచేసే ధైర్యం కూడా టీడీపీ చేయలేకపోయింది. దీంతో ఆ పార్టీ పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. 
- టీడీపీ అంతర్థానం కాబోతుంది. దీన్ని తట్టుకోలేక, చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా, టెర్రరిస్టులుగా తయారై నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నారు.

 ఎన్నడూలేనిది చంద్రబాబు రాష్ట్రంలో రాజకీయాల్లో వికృత ధోరణల్ని ప్రవేశపెట్టి ప్రోత్సహిస్తున్నాడు.  అందులో భాగంగానే, గంజాయి అంటాడు, హెరాయిన్ అంటాడు, అప్ఘానిస్తాన్ అంటాడు, బూతులు మాట్లాడిస్తాడు, పాదయాత్రలు చేయిస్తాడు, పసుపు నీళ్ళతో కడిగించటం.. ఇలా తాను ఏం చేస్తున్నాడో  తెలియకుండా.. పిచ్చి పిచ్చి పనులు చేస్తూ.. తెలుగుదేశం పార్టీకి ఓ  పిచ్చిపట్టిన నాయకుడిగా తయారయ్యాడు. 

  న్యాయమూర్తులకు.. కంటెప్ట్ ఆఫ్ కోర్టు యాక్ట్ 1971 ఎలా ఉందో... అదే రీతిలో రాజ్యాంగ హోదాలో ఉన్నవారి పట్ల కూడా ఎవరైనా ఇటువంటి అసభ్యకరమైన మాటలు మాట్లాడితే.. చట్టబద్ధంగా చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని రాష్ట్రపతి గారిని కోరాం. 

  గత ఏడాదిన్నరగా.. ఫ్రస్ట్రేషన్ లో కూరుకుపోయిన చంద్రబాబు ఒక టెర్రరిస్ట్ గా, ఆయన నేతృత్వంలో నడుస్తున్న పార్టీ నేతల సమూహంతో మాట్లాడిస్తున్న అసభ్యకరమైన బూతు భాష ఏ విధంగా ఉందో రాష్ట్రపతిగారికి వివరించి, ఆ పార్టీని రద్దు చేయాలని కోరాం. 
- ఇప్పుడు టీడీపీ ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితే లేదు. 2024లోనూ, భవిష్యత్తులో జరిగే ఎన్నికలకు ఇదొక సంకేతమ‌ని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

Back to Top