ఏపీ విపక్షాల్లో బ్రిటిష్‌ అవశేషాలు

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి
 

తాడేప‌ల్లి: స్వాతంత్య్రానికి పూర్వం భారతదేశాన్ని పరిపాలించిన బ్రిటిష్‌ వారు విభజించి పాలించు అనే సిద్దాంతాన్ని అనుసరించేవారని, కొన్ని కులాలను రెచ్చగొట్టేవారని, అణగారిన, వెనుకబడ్డ వర్గాల వారికి మరింతగా తొక్కేసేవారని, ఆయా వర్గాల వారు రాజధానిలో వారు ఉండరాదు, ఊరికి దూరంగా లేదా అడవుల్లో ఉండాలని బ్రిటిషర్లు అనేవారని రాజ్యసభ సభ్యులు,జాతీయ ప్రధాన కార్యదర్శి  వి.విజయసాయి రెడ్డి అన్నారు. అదే సిద్ధాంతాన్ని ఇప్పుడు ఏపీలో విపక్షాలు అనుసరిస్తున్నాయని, బ్రిటిషర్ల అవశేషాలు ఇప్పుడు ఏపీ విపక్షాల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయని మండిపడ్డారు. స్వతంత్రానికి 1947 కి ముందు అది చెల్లింది కానీ ఇప్పుడు చెల్లదని చెప్పారు.

రాష్ట్ర ప్రజలకు ఇబ్బందులు కలగకుండా విద్యుత్‌ను అందిస్తున్న ఆంధ్రప్రదేశ్‌ పవర్‌ జనరేషన్‌ కార్పొరేషన్‌(ఏపీ జెన్.కో)ను ఆయన ప్రశంసించారు..
రాష్ట్ర విభజన తరువాత ఎన్నడూ లేనంతగా రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, 260 మిలియన్ యూనిట్లు విద్యుత్ డిమాండ్ ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఏర్పడ్డ డిమాండ్ ను వ్యవసాయ అవసరాలతో సహా ఏపీ జెన్ కో సునాయాసంగా అందించగలుగుతుండడం ప్రశంసనీయమని అన్నారు. ఇది సాధించేందుకు సంస్థ సరైన మందస్తు ఏర్పాట్లు, విస్తృత స్థాయి ప్రణాళిక చేపట్టిందని కోనియాడారు..

 వెల్లువెత్తిన వినతులు 

సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా  వినతులను రాష్ట్ర పార్టీ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి స్వీకరించారు. తాడేపల్లి కేంద్ర పార్టీ కార్యాలయంలో వరుసగా రెండో రోజు మంగళవారం గ్రీవెన్స్ నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన పార్టీ నాయకులు, ప్రజల నుండి వినతులను స్వీకరించి కొన్ని సమస్యలకు అక్కడికక్కడే  పరిష్కరించారు.. పార్టీ టీచర్స్ విభాగం, ఆంధ్రప్రదేశ్ టైలర్స్ ఫెడరేషన్, బహుజన పరిరక్షణ సమితి ప్రతినిధులతో పాటుగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి గారిని కలిశారు..

Back to Top