నిమ్మగడ్డ రాసిన లేఖపై విచారణ జరిపించండి

ఆ లేఖ టీడీపీ ఆఫీస్‌లోనే తయారైందనే సమాచారం ఉంది

డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి లేఖ

తాడేపల్లి: కేంద్ర హోంశాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ రాసిన లేఖపై విచారణ జరిపించాలని ఎంపీ విజయసాయిరెడ్డి డీజీపీ గౌతమ్‌సవాంగ్‌ను కోరారు. 'రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర హోంశాఖకు రాసిన లేఖలో ఉన్నది ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లు. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ సందర్భంగా రమేష్‌కుమార్‌ చేసిన సంతకానికి, ఇప్పుడు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదు. సంతకం ఫోర్జరీ చేసిన లేఖ కచ్చితంగా టీడీపీ ఆఫీసులోనే తయారయిందని తమ దగ్గర సమాచారం ఉన్నట్లు డీజీపీకి రాసిన లేఖలో ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఇది కచ్చితంగా ఉద్దేశపూర్వకంగా చేశారని, ఇందులో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌, వర్ల రామయ్య, టీడీ జనార్దన్‌ల హస్తం ఉందన్నారు. వీరంతా కలిసే ఈ లేఖను సృష్టించారని, అయితే ఈ తతంగమంతా రమేష్‌కుమార్‌కు తెలిసే జరిగిందని పేర్కొన్నారు. ఫోర్జరీ సంతకాలు, కల్పిత డాక్యుమెంట్లపై డీజీపీ విచారణ చేయాల్సిందిగా లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఆ లేఖను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాలని, దీనిపై వచ్చే నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోవాల్సిందిగా వెల్లడించారు. ఐపీ ఆధారంగా ఈ లేఖను ఎవరు పంపారో గుర్తించి చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి డీజీపీని కోరారు.

తాజా వీడియోలు

Back to Top