పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి ఏకగ్రీవ ఎన్నిక

ఢిల్లీ: పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  పార్టీ పార్ల‌మెంట‌రీ నేత విజయసాయిరెడ్డి మంగళవారం ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు. విజయసాయిరెడ్డితో పాటు మరో సభ్యుడిగా బీజేపీ ఎంపీ సుధాంశు త్రివేది ఎన్నికయ్యారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ దేశ్‌దీపక్ శర్మ.. పార్లమెంట్‌ బులిటెన్‌ విడుదల చేశారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వ ఖాతాలను పరిశీలించనుంది.

‘చిట్టినాయుడి కామెడీకి స్టాప్ గేట్లు ఉండవు’
 
ట్విట్టర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  ఎంపీ విజయసాయిరెడ్డి

 ట్విట్టర్‌ వేదికగా వైయ‌స్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మరోసారి చంద్రబాబు తనయుడు నారా లోకేష్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘రాజకీయాలను సర్కస్‌తో పోల్చడం కొత్తేమీకాదు. కాకపోతే సర్కస్‌లో ఉండే బఫూన్ క్యారెక్టర్లు రాజకీయాల్లో ఉంటే నాన్ స్టాప్‌ కామెడీనే’ అంటూ ఆయన చలోక్తులు విసిరారు. ‘మోకాల్లోతు నీళ్లల్లో లైఫ్ జాకెట్‌తో దిగి లోకేష్ అనే బఫూన్‌ హాస్యం పండిస్తున్నాడు. చిట్టినాయుడి కామెడీకి స్టాప్ గేట్లు ఉండవంటూ’’ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top