వారంతా సిగ్గు ప‌డాలి..

దుబారా ఖర్చులను కట్టడి చేసిన సీఎం వైఎస్‌ జగన్‌

ట్విటర్‌లో ఎంపీ  విజయసాయిరెడ్డి

అమరావతి : వృద్ధాప్య, వితంతు, వికలాంగుల పింఛన్లను భారీగా పెంచిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌.. దేశంలోనే చరిత్ర సృష్టించిందని  వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ  విజయసాయి రెడ్డి ట్విట్ చేశారు. ఇప్పటి వరకు కిడ్నీబాధితుల సమస్యను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్న వారంతా సిగ్గుపడాలన్నారు. శనివారం ఆయన ట్విటర్‌ వేదికగా నూతన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న పనులను ప్రజలకు తెలియజేశారు. ‘నేను చూసాను. నేను ఉన్నాను’ అంటూ పాదయాత్రలో ఇచ్చిన మాట మేరకు యువ ముఖ్యమంత్రి కిడ్నీ బాధితులకు నెలకు పదివేల ఆసరా కల్పించారని విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. దుబారా ఖర్చులను సీఎం వైఎస్‌ జగన్ కట్టడి చేశారని, ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇది స్పష్టంగా కనిపించిందన్నారు. ప్రతి రూపాయి వ్యయానికి జవాబుదారితనం ఉంటుందని, హిమాలయ వాటర్ బాటిల్స్ కనిపించవని చంద్రబాబు ప్రభుత్వ దుబార ఖర్చును పరోక్షంగా ప్రస్తవించారు. రాష్ట్రం అప్పుల్లో ఉందని తెలిసి కూడా గత ప్రభుత్వం విలాసాలు వదులుకోలేదని మండిపడ్డారు.

Back to Top