అమరావతి: సీఎం వైయస్ జగన్‌కు చంద్రబాబు రాసే మొదటి లేఖ ప్రజా సమస్యలపై ఉంటుందనుకున్నామని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్టర్‌లో పేర్కొన్నారు.40 ఏళ్ల అనుభవానికి తను ఉండే విలాసవంతమైన నివాసం ఉంటుందా..పోతుందా అనే సంశయం తప్ప ఇంకేమీ కనిపించడం లేనట్లుంది.ప్రపంచం మొతాన్ని అమరావతికి రప్పిస్తా అన్న వ్యక్తికి సొంత ఇల్లు కట్టుకునే ఆలోచన లేనట్టేగా అని అన్నారు.
సీఎం వైయస్ జగన్‌కు ఎంపీ విజయసాయిరెడ్డి ధన్యవాదాలు
వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ నేతగా నియమించినందుకు వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు,సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు.పార్టీ లోక్‌సభ పక్షనేతగా నియమితులైన పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి,చీఫ్ విప్‌గా నియమితులైన మార్గాని భరత్‌రామ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు.
ప్రజాధనం దోపిడీలో కోడెల జులుం
ప్రజాధనం దోపిడీలో జులుం ప్రదర్శించిన కోడెల శివప్రసాద్‌రావు స్పీకర్ పదవికే కళంకం తెచ్చారని విజయసాయిరెడ్డి మరో ట్విట్‌లో పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ,ఉద్యోగుల హెల్త్‌స్కీం,ఫార్మసీ కౌన్సిల్ ఆఫీసులను కనీస వసతులు కూడా లేని సొంత భవనంలో పెట్టించారని తెలిపారు.చదరపు అడుగుకు రూ.16 అయితే, పైరవీ చేసుకుని రూ.25 తీసుకున్నారన్నారు.కోడెల రూ.4.5 కోట్లపైనే లూటీ చేశారని ఆరోపించారు.