28న విశాఖలో జననేతకు ఘనస్వాగతం పలుకుదాం

ట్విట్టర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి

తాడేపల్లి: ఉత్తరాంధ్రను అక్కున చేర్చుకొని విశాఖను పాలనపరమైన రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో థాంక్యూ జగనన్న అంటూ సీఎం వైయస్‌ జగన్‌కు మద్దతు పలకండి అంటూ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి కోరారు. 28న సీఎం వైయస్‌ జగన్‌ విశాఖ పర్యటన నేపథ్యంలో జననేతకు ఉత్తరాంధ్ర ప్రజలు ఘనస్వాగతం పలకండి అంటూ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో ఒక లేఖను పోస్టు చేశారు. ‘విశాఖను ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌గా ప్రకటించిన తొలిసారిగా ఈ నెల 28వ తేదీన ఫెస్టుకు సీఎం వస్తున్నారు. విశాఖ ఫెస్టు కార్యక్రమం వేరుగా జరుగుతున్నా.. ఆ కార్యక్రమానికి సీఎం వైయస్‌ జగన్‌ సమయంలో.. రాజధాని ప్రకటన పట్ల ఉత్తరాంధ్ర ఎంతగా సంతోషిస్తోందో మిగతా రాష్ట్రానికి, దేశానికి తెలిసేలా మనమంతా చేయీ చేయీ కలిపి సీఎంకు స్వాగతం పలుకుదాం. ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గానికి ఇరువైపులా మానవ తోరణంగా ఏర్పడి థాంక్యూ జగనన్నా అంటూ గొప్పగా స్వాగతం పలుకుదాం’ అని ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ సీనియర్‌ నేతలను కోరుతూ లేఖ ట్వీట్‌ చేశారు. 
 

Back to Top