సీఎం వైయస్‌ జగన్‌ చేతల మనిషి

ట్విట్టర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి
 

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ చేతల మనిషి అని, ప్రచారానికి ఆయనెప్పుడు దూరంగా ఉంటారని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో స్పందిస్తూ.. 'సీఎం వైయస్‌ జగన్‌ ఏదైనా టాస్క్ విజయవంతమైతే క్రెడిట్ అధికారులకిస్తారు. లోటుపాట్లుంటే ఆ బాధ్యత తానే తీసుకుంటారు. చంద్రబాబులా రోజుకు 16 వీడియో కాన్ఫరెన్సులు, మీడియా సమావేశాల హడావుడి లేదిప్పుడు. ఇదంతా పచ్చ మీడియాకు కనిపించదు'.
పొలికేకలకి, పరిపాలనకి తేడా ఇదే!
'తుఫాన్లు వస్తే మీడియా ఫోకస్ అంతా తనమీద ఉండేలా డ్రామాలాడేవాడు. పుష్కరాల్లో30 మందిని పొట్టన పెట్టుకున్న వ్యక్తి అనుభవజ్ఞుడు, విజనరీ ఎలా అవుతాడు? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. సీఎం వైయస్‌ జగన్‌ రూట్ మ్యాప్ ఇచ్చి అధికారులను పురమాయించారు. కలెక్టర్లు స్వేచ్ఛగా పనిచేస్తున్నారు. పొలికేకలకి, పరిపాలనకి తేడా ఇదే! అని ట్వీట్‌ చేశారు.
చంద్రబాబు ఏడుపంతా ఆ ఛాన్స్‌ మిస్సైందనే..
గతంలో విపత్తుల పేరుతో దోచుకున్నది చాలక.. కరోనా పేరుతో మళ్లీ దోచుకునే అవకాశం చేజారిందని చంద్రబాబు ఏడుస్తున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. "'ద్‌ హుద్, తిత్లీ తుఫాన్ల పరిహారం పేరుతో వందల కోట్లు పచ్చ నాయకులకు దోచిపెట్టాడు బాబు. భూములు లేని వారికి నష్ట పరిహారం అందింది. నిజమైన బాధితులకు సీఎం వైయస్‌ జగన్ వచ్చాక న్యాయం జరిగింది. కరోనా మహమ్మారి విజృంభించిన ప్రస్తుత పరిస్థితుల్లో గోల్డెన్ ఛాన్స్ మిస్సయిందని ఏడుస్తున్నాడు' అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top