రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు అనుమతి ఇవ్వాలి  

కేంద్ర జలశక్తి మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ
 

ఢిల్లీ: రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు అనుమతి ఇవ్వాలని కేంద్ర మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్‌ను వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కోరారు.  కేఆర్‌ఎంబీ పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయ‌న‌పేర్కొన్నారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. కృష్ణా జలాల వివాదం అంశంపై కేంద్రమంత్రితో ఆయన చర్చించారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

కేఆర్‌ఎంబీ పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలని కోరామన్నారు, తెలంగాణ ప్రభుత్వం చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తోందని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. చట్ట ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరామన్నారు. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం.. ఏలేశ్వరం ప్రాజెక్టు ఖర్చును సగభాగం జలజీవన్‌ పథకం కింద భరించాలని కోరామని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top