బీసీ విభాగం నేత‌ల‌తో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స‌మావేశం

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పార్టీ బీసీ విభాగం నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. శుక్ర‌వారం తాడేపల్లి లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేర‌కు, పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జి  వి.విజ‌య‌సాయి రెడ్డి బీసీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు.  వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు, శాసనమండలి ప్రభుత్వ విప్  జంగా కృష్ణమూర్తి   అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన  స‌మావేశంలో బీసీ విభాగ రాష్ట్ర జోన‌ల్ ఇంఛార్జిలు, జిల్లా అధ్య‌క్షులు హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో వివిధ స్థాయిల్లో బీసీ విభాగ క‌మిటీల నియామ‌కంపై స‌మీక్షించారు.  విభాగ‌ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై విజ‌య‌సాయిరెడ్డి దిశా నిర్దేశం  చేశారు.

మేనిఫెస్టోకు అస‌లైన అర్థం చెప్పారు:  విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, జీపీఎస్‌కు ఆమోదంతో 99శాతం హామీలు అమలు చేసి మేనిఫెస్టోకు అసలైన అర్థం చెప్పార‌ని ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. వందల హామీలతో ప్రతిపక్షం విడుదల చేసింది 'మోసఫెస్టో', 'మాయాఫెస్టోస‌.. ప్రజలు దానిని చెత్తబుట్టలో పారేస్తార‌ని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Back to Top