చంద్రబాబు గారూ పిల్లి శాపాలకు ఉట్లు తెగవు..

ట్విట‌ర్‌లో ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

చంద్రబాబు గారూ పిల్లి శాపాలకు ఉట్లు తెగవు అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్విట‌ర్‌లో విమ‌ర్శ‌లు గుప్పించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం అసాధ్యమట. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం వీలు కాదంట. తన వల్ల కాని పనులను ఇంకెవరూ చేయలేరన్నట్ట సెలవిచ్చారు. అన్నమాట ప్రకారం జగన్ గారు చేసి చూపిస్తారు. మీరూ చూస్తారు. అని ట్విట‌ర్‌లో పేర్కొన్నారు.

మీకు మీరే  పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా?
చంద్రబాబు గారేమో ఆకాశమంట, లోకేశేమో మిరుమిట్లు గొలిపే నక్షత్రమంట. ఆకాశంపై ఉమ్మేయొద్దని సలహా ఇస్తున్నాడు. అందనంత స్థాయి అని మీకు మీరే  పొగుడుకుంటున్నారా మందలగిరి మారాజా? అంటూ  ట్విట‌ర్‌లో చ‌లోక్తులు విసిరారు.

ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబు గారే చెప్పాలి?
లింగమనేని గెస్ట్‌హౌస్‌ను ల్యాండ్‌పూలింగ్‌లో సేకరించి ప్రభుత్వ అతిథి గృహంగా మార్చినట్టు మార్చి 6, 2016 న చంద్రబాబు ప్రకటించార‌ని ట్విట‌ర్‌లో పేర్కొన్నారు.  కార్డుల్లో మాత్రం అది ఇప్పటికీ లింగమనేని పేరనే ఉంది. తర్వాత దాని రెనోవేషన్ కోసం 8 కోట్లు ఖర్చుపెట్టారు. ఇంతకీ అది ఎవరిదో చంద్రబాబు గారే చెప్పాలి? అంటూ ట్విట‌ర్‌లో ప్ర‌శ్నించారు.

Back to Top