కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం

ఏపీకి కేంద్రం మొండి చేయి చూపింది

బడ్జెట్‌లో ఏపీకి ఒరిగింది సున్నా

రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు పోరాటానికి సిద్ధం

వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిందని వైయస్‌ఆర్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. కేంద్ర బడ్జెట్‌ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్‌లో ఏపీకి అదనంగా ఇచ్చింది ఏదీలేదని..కేంద్ర బడ్జెట్‌  నిరాశపరిచిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదన్నారు.  కేంద్ర ప్రభుత్వం ఏపీకి మొండిచేయి చూపిందన్నారు. విభజనన చట్టంలోని అంశాలపై కూడా మాట్లాడలేదన్నారు. విశాఖ,విజయవాడ మెట్రోల గురించి ప్రస్తావన లేదన్నారు. పెట్టుబడుల ఉపసంహరణ మంచిది కాదని తెలిపారు.  

తప్పకుండా ఏపీకి సాయం చేస్తామనే హామీని కేంద్రం  నిలబెట్టుకోలేదని పేర్కొన్నారు.విశాఖ,విజయవాడ,మెట్రో రైలుకు నిధుల విషయంలో అన్యాయం జరిగిందన్నారు. జీరో బడ్జెట్‌ వ్యవసాయంపై స్పష్టత ఇవ్వలేదని వెల్లడించారు. అలాగే రాష్ట్రానికి ఎన్ని నిధులు కేటాయిస్తున్నారనే దానిపై స్పష్టత లేదని ఆయన అన్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ఏ పోరాటానికైనా తాము సిద్ధమన్నారు. ఏపీకి జరిగిన అన్యాయాన్ని పార్లమెంట్‌లో ప్రశ్నిస్తామని   తెలిపారు. ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌ కార్డ్‌ ఇవ్వడం అభినందనీయమని తెలిపారు.
 

Back to Top