10 వేల వైద్య పోస్టుల భ‌ర్తీకి ప్ర‌భుత్వం చ‌ర్య‌లు

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తిరుమ‌ల‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ ‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం గవర్నమెంట్‌ ఆస్పత్రులకు అదనపు బలాన్ని చేకూరుస్తోందని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి   పేర్కొన్నారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న ట్వీట్ చేశారు. ఒకే నోటిఫికేషన్ ద్వారా దాదాపు 10 వేల వైద్య పోస్టుల భర్తీకి తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని అన్నారు. గత ప్రభుత్వాలు నియామకాలు చేపట్టకపోవడంతో.. ప్రభుత్వాస్పత్రులు నిర్వీర్యమయ్యాయని అన్నారు. ఇకపై 24 గంటలూ పూర్తిస్థాయిలో సిబ్బందితో ప్రభుత్వాస్పత్రులు పనిచేస్తాయని విజయసాయిరెడ్డి ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. 

Back to Top