సీఎం వైయ‌స్‌ జగన్ దార్శనికతను దేశమంతా కొనియాడుతోంది 

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

విశాఖ‌ :  ఆంధ్రప్రదేశ్‌లో పక్కా గృహాల నిర్మాణం పూర్తయితే ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆస్తి సొంతమవుతుందని వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్లమెంటరీ నాయకుడు విజయసాయిరెడ్డి అన్నారు. గురువారం ట్విటర్‌ వేదికగా ఆయన స్పందిస్తూ.. నిరుపేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి దార్శనికతను దేశమంతా కొనియాడుతోంది. శాశ్వత చిరునామా అంటూ లేని 30 లక్షల కుటుంబాలకు ఇంత భారీ స్థాయిలో ఉచితంగా స్థలాలు అందజేయడం చరిత్రలో నిలిచిపోతుందని విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

పక్కా గృహాల నిర్మాణం పూర్తయితే ప్రతి కుటుంబానికి 15 లక్షల ఆస్తి సొంతమవుతుంది ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. అంతకు క్రితం మరో ట్వీట్‌లో కేంద్ర ప్రభుత్వం కృష్ణపట్నం పారిశ్రామిక కారిడార్‌కు ఆమోదం తెలపడంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top