‘అన్న క్యాంటీన్లలో రూ. 150 కోట్ల స్కాం’

 విజయసాయిరెడ్డి

అమరావతి : పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఉంటే సగం రాష్ట్రం జలసిరితో సస్యశ్యామలమయ్యేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నేత  విజయసాయిరెడ్డి అన్నారు. ఐదేళ్ల పాలనలో ప్రాజెక్టులో అందినకాడికి దోచుకుందామని చూశారే తప్ప.. ప్రాజెక్టును పూర్తి చేద్దామన్న చిత్తశుద్ధి కనబరచలేదని చంద్రబాబును విమర్శించారు. సకాలంలో ప్రాజెక్టు పూర్తయి ఉంటే రోజుకు 60 టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలయ్యేది కాదని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో స్పందించారు.

అదే విధంగా ఎన్నికల ముందు ప్రజలను ప్రలోభ పెట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్లలో రూ. 150 కోట్ల కుంభకోణం జరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు. పేదలకు తక్కువ ధరకు భోజనం పెట్టే పథకంలో కూడా అందినకాడికి దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు లక్షలతో నిర్మించే క్యాంటీన్‌కు రూ. 30-50 లక్షలు ఖర్చయిందని లెక్కలు చూపారని గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

Back to Top