‘ఎవరో కన్న బిడ్డకు, ఇంకేవరో బర్త్‌డే సెలబ్రేట్‌ చేసినంత దరిద్రంగా ఉంది’

 అమరావతి:  టీడీపీ ఆవిర్భావ దినోత్సవంపై వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, రాజ్యసభ్య ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఎవరో(దివంగత ఎన్టీఆర్‌) కన్న బిడ్డకు, ఇంకేవరో బర్త్‌డే సెలబ్రేట్‌ చేసినంత దరిద్రంగా టీడీపీ ఆవిర్భావ కార్యక్రమం ఉందని విమర్శలు గుప్పించారు.

టీడీపీ చంద్రబాబు పెట్టిన పార్టీ కాదని, ఎన్టీఆర్‌ నుంచి దొంగతనంగా గుంజుకున్నదని ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు కపట వేషాలు చూస్తూ పైన ఉన్న ఆ పెద్దాయన ఆత్మ ఎంతగా క్షోభిస్తోందో అంటూ చురకలంటించారు. ఈమేరకు విజయసాయిరెడ్డి బుధవారం ట్వీట్‌ చేశారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top