ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమే

ఆంధ్రప్రదేశ్‌ కోణంలో ఇది చెత్త బడ్జెట్‌

ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ

రాజ్య‌స‌భ‌లో ఎంపీ  విజయసాయిరెడ్డి

న్యూఢిల్లీ: ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ నేత, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.  రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై జ‌రిగిన చర్చలో ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్‌ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌.. చెత్త బడ్జెట్‌ అని విమ‌ర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ నిరాశ పరిచిందని అన్నారు. సెస్‌లు, సర్‌ఛార్జ్‌ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్‌ విషయంలో ట్యాక్స్‌ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు.

2010-2015  మధ్య ఏపీ షేర్‌ 6.9 శాతం కాగా, 2015-2020 నాటికి ఏపీ పన్నుల వాటా 4.3 శాతానికి పడిపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం 5.9 శాతం నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. కానీ, కేంద్రం వెచ్చిస్తోంది 3.9 శాతం మాత్రమేనని చెప్పారు. విద్య కోసం ఏపీ 11.8 శాతం ఖర్చుచేస్తుంటే కేంద్రం 2.6 శాతం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ కేంద్రం కంటే రాష్ట్రామే ఎక్కువ ఖర్చు చేస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.

తాజా వీడియోలు

Back to Top