సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాలనలో రైతులంతా సంతోషం ఉన్నారు

 ఇప్పేరు, ముద్దాలపురం చెరువులకు నీరు విడుదల చేసిన ఎంపీ తలారి రంగయ్య  

అనంత‌పురం:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న‌లో రైతులంతా సంతోషంగా ఉన్నార‌ని ఎంపీ త‌లారి రంగ‌య్య అన్నారు. కూడేరు మండలంలో దశాబ్దాలుగా కలగా ఉన్న ఇప్పేరు, ముద్దాలపురం చెరువులకు శాశ్వత పరిష్కారం చూపి నీరిచ్చామని  మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి, ఎంపీ తలారి రంగయ్య అన్నారు. శుక్రవారం కూడేరు మండలం పి.నారాయణపురం వద్ద హంద్రీనీవా నుంచి ముద్దాలపురం, ఇప్పేరు చెరువులకు ఎంపీ రంగయ్య, ఎంపీపీ నారాయణ రెడ్డి, జెడ్పిటిసి అశ్విని, బెస్త కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ రమణ , వైయ‌స్ఆర్‌సీపీ  నాయకులతో కలిసి విశ్వేశ్వరరెడ్డి నీటిని విడుదల చేశారు. అంతకుముందు వారు కృష్ణా జలాలకు శాస్త్రోక్తంగా గంగ పూజను నిర్వహించారు.ఈ సందర్భంగా ఇప్పేరు, ముద్దాలపురం, చోళసముద్రం తదితర గ్రామాల రైతులు వారిని సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈరోజు చాలా సంతోషకరమైన రోజుగా అభివర్ణించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నపుడు ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారం చేస్తామని చెప్పాం ..చేసి చూపించామని పేర్కొన్నారు.నిరంతరం రైతుల ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు.పిల్లకాలువ కు భూములు కోల్పోయిన రైతుల అకౌంట్లలో నగదు జమ అవుతుంటే ఎక్కడ తన ఉనికిని కోల్పోతాననే భయంతో నీటి రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. తన ఐదేళ్ల టీడీపీ ప్రభుత్వంలో శాశ్వత పరిష్కారం చేయకపోగా ఇప్పుడు తమ వల్లే పరిహారం వచ్చిందని డప్పు కొట్టుకోవడం సిగ్గుచేటన్నారు. నీచేతకాని తనం వల్ల పరిహారం చెల్లింపు ఆలస్యమైంది నిజం కాదా..పరిహారం కోసం టీడీపీ అనుకూల రైతులతో నీరు వెళ్లకుండా కాలువకు అడ్డుపడింది నిజం కాదా అని ప్రశ్నించారు. నాడు కేశవ్ అన్ని అనుమతులు తీసుకుని చేసి ఉంటే రెండేళ్ల క్రితమే నీళ్లిచ్చే వాల్లమన్నారు. ఎవరెన్ని అబద్ధాలు చెప్పినా దుష్ప్రచారం చేసిన కూడేరు మండల రైతులకు వాస్తవం తెలుసన్నారు.వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బైరెడ్డి రామచంద్రరెడ్డి, వైస్ ఎంపీపీలు సుబ్బమ్మ , దేవ సర్పంచులు ఇప్పేరు ఓబులేష్ ,ముద్దాలాపురం ధనుజయ్య, అరవకూరు రామాంజీనేయులు, ఎంపిటిసిలు దొడ్డికల్లు రమేష్, ఇప్పేరు రైతులు తిమ్మారెడ్డి ధనుజయ్య,పెద్దన్న. ఏరప్ప వైసార్సీపీ నాయుకులు, కూడేరు రామాంజినేయులు, రాజశేఖర్ రెడ్డి,మల్లిరెడ్డి, మరుట్ల శ్రీరామిరెడ్డి, నీలకంఠ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top