మా చెమటవాసనే గిట్టనప్పుడు మా ఓట్లు నీకెందుకు బాబూ..?

వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ  నందిగం సురేశ్‌

బాబు హయాంలో దళితులకు అడుగడుగునా అవమానాలే

ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలనుకుంటారా..అన్నది బాబే

దళితులకు చదువు అబ్బదని, శుభ్రం తెలియదన్నది టీడీపీ నేతలే

ఈ విషయాలన్నీ ఆపార్టీలోని ఎస్సీనేతలకు తెలియదా..?

అన్నీ తెలిసీ దొంగ సదస్సులు ఎందుకు..?

ఎంపీ నందిగం సురేశ్‌ ఫైర్‌

తన హయాంలో దళితుల్ని విస్మరించింది చంద్రబాబే

 ఎస్సీలకు తానేం మేలు చేశానో చెప్పుకోలేడు

 మ్యానిఫెస్టోలో 650 హామీలిచ్చి ఆరైనా నెరవేర్చని నీచుడు

 ఎన్నికలనగానే మళ్లీ ఆల్‌ఫ్రీ అవతారమెత్తిన బాబు

 బాబు దృష్టిలో మేనిఫెస్టో అంటే చెత్తడబ్బానే

 వైయస్ జగన్ గారికి మేనిఫెస్టోనే భగవద్గీత, ఖురాన్, బైబిల్

 గుర్తుచేసిన ఎంపీ నందిగం సురేశ్‌ 

 మేనిఫెస్టోలో 99.5 శాతం హామీల్ని నెరవేర్చాం

 ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే వైనాట్‌ 175 అంటున్నాం

 2024లో 175 స్థానాల్ని వైయస్‌ఆర్‌సీపీ కైవసం ఖాయం

 ధీమా వ్యక్తంచేసిన ఎంపీ  నందిగం సురేశ్‌

హాఫ్‌మైండ్‌గాడు లోకేశ్‌

 అబద్ధాల్లో తండ్రిని మించిన తనయుడు లోకేశ్

 లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లకు ఎమ్మెల్యేలుగా గెలిచే దమ్ముందా..?

  స్థాయికి మించి విమర్శిస్తే ఇద్దరికీ గుణపాఠం తప్పదు

  హెచ్చరించిన ఎంపీ నందిగం సురేశ్‌

తాడేప‌ల్లి: మా చెమటవాసనే గిట్టనప్పుడు మా ఓట్లు నీకెందుకు చంద్ర‌బాబూ..? అంటూ వైయస్ఆర్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్య‌క్షుడు, ఎంపీ  నందిగం సురేశ్ ప్ర‌శ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కంటే నారా లోకేశ్‌ ఎక్కువ అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేశ్‌ హైదరాబాద్‌ పారిపోతారు. పవన్‌ కల్యాణ్ ఎన్నికల తర్వాత సినిమాలు తీసుకోవాల్సిందేనని ఎద్దేవా చేశారు. చంద్రబాబు మాదిగలకు ఏం చేశాడో చెప్పాలి. మాదిగలపై అక్రమ కేసులు పెట్టించింది చంద్రబాబు కాదా?. మాదిక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తానని చంద్రబాబు మోసం చేశాడు. చంద్రబాబు.. మాదిగలకు ఎంపీ సీటు ఇచ్చాడా?. 29 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని మేలు ఏపీలో దళితులకు జరిగింది. చంద్రబాబు దగ్గర కొందరు నేతలు బానిసలుగా ఉన్నారు. ఎస్సీలను రాజధానిలో చంద్రబాబు దొంగలుగా చిత్రీకించారు. వర్ల రామయ్యకి రాజ్యసభ ఇస్తానని అవమానించింది చంద్రబాబు కాదా?. ఎస్సీలలో ఎవరు పుట్టాలని అనుకుంటారని చంద్రబాబు అవమానించలేదా? అని నిల‌దీశారు. తాడేపల్లి వైయ‌స్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌ మీడియాతో మాట్లాడారు..

 దళితులంటే చంద్రబాబుకు చులకనః
ఈరోజు టీడీపీలో ఉన్న ఎస్సీ నాయకులంతా ఒక సభ పెట్టి మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారిని ధూషణ చేస్తున్నారు. దళితజాతిని అవమానించిన రాజకీయ నేతల్లో చంద్రబాబు ముందువరుసలో ఉన్నాడు కదా..? మరి, ఆయన  హయాంలో దళితులకు అడుగడుగునా అవమానాలే ఎదురైన సంగతి వారంతా మరిచిపోయారా..? ఎస్సీ, ఎస్టీలంటే చులకనభావంతో గతంలో చంద్రబాబు ఎన్నెన్నో మాటలన్నారు. మా చెమట వాసన తనకు నచ్చదన్నాడు. మాతో మాట్లాడాలన్నా.. మా సమస్యల్ని పరిష్కరించాలన్నా కూడా ఏనాడూ ఆయనకు నచ్చదు. ఏం చేస్తాం.. ఈ రాష్ట్రంలో మమ్మల్ని తక్కువగా చూసే చంద్రబాబు ఉండటం మేం చేసుకున్న దురదృష్టమని ఆనాడు దళితులు బాధపడ్డారు. ఎస్సీల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా..? అని చంద్రబాబు అవమానించిన నాడే ఆయన బుద్ధి ఏంటో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతీ ఒక్క దళిత వ్యక్తికి తెలిసిపోయింది. ఇప్పటికీ దళితుల పట్ల ఆయన బుద్ధి మార్చుకోవడంలేదు. ఎస్సీలకు చదువు పెద్దగా అబ్బదని, వాళ్లు శుభ్రంగా ఉండరని ఏకంగా టీడీపీలోని కొందరు పెద్దలు బహిరంగంగా ప్రకటించిన సంగతి కూడా మేం మరొక్కసారి గుర్తుచేస్తున్నాం. 

ఎస్సీఎస్టీల్ని తన బంధువులన్నది జగన్‌ గారుః
మరి, దళితులంటేనే గిట్టని నాయకుడుగా చంద్రబాబు ఉంటే, మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు మాత్రం నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ.. ఎస్సీఎస్టీలు తన అన్నదమ్ముళ్లుగా అక్కునజేర్చుకున్నారు. దీన్నిబట్టి దళితులంటే ఎవరికి ప్రేమ ఉందో.. ఎవరు దళితుల పట్ల నీచంగా వ్యవహరిస్తున్నారనేది ప్రజలకు తెలిసిపోయింది. దీన్ని మరిచి బాబు చెప్పాడని .. ఆయనకు ఊడిగం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్న టీడీపీ ఎస్సీనేతలు పొలోమంటూ సభ పెట్టడం.. మా జగన్‌గారిని తూలనాడటం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నాను. జగన్‌గారు ఇంటి గుమ్మం ముందు వదిలే చెప్పులు గురించి మాట్లాడుతారు..తాగే మంచి నీళ్ల గురించి వాళ్లు మాట్లాడుతున్నారు. నిజంగా, జగన్‌ గారు వాడే చెప్పులు, తాగే నీళ్లు గురించి ఏమాత్రం అవగాహనలేకుండా టీడీపీ ఎస్సీనేతలు ఎలా మాట్లాడతారు..? మీలో ఎవరైనా వస్తే నిజనిజాల్ని నేను నిరూపించి చూపిస్తానని సవాల్‌ విసురుతున్నాను. 

హాఫ్‌మైండ్‌ గాడు లోకేశ్ః
ఏమాత్రం రాజకీయ అవగాహనలేని హాఫ్‌మైండ్‌గాడు లోకేశ్‌ మా నాయకుడు జగన్‌గారిపై ఏవేవో విమర్శలు చేస్తున్నాడు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబును మించినోడుగా తయారయ్యాడు.  పేద ముఖ్యమంత్రిగా చెబుతూ జగన్‌గారిపై వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అరేయ్‌ లోకేశ్‌.. మా నాయకుడు ఎప్పుడూ తాను పేద ముఖ్యమంత్రినని చెప్పలేదు. పేదలకు మేలు చేసే ముఖ్యమంత్రిని అని చెప్పారు. మా నాయకుడు జగన్‌ గారు పుట్టుకతోనే కోటీశ్వరుడని మేం ధీమాగా చెబుతున్నాం. మరి, రెండెకరాలతో రాజకీయ జీవితం ప్రారంభించిన నీ తండ్రి చంద్రబాబు ఈరోజు వేలకోట్లు ఎలా సంపాదించాడని అడుగుతున్నాం. సమాధానం చెప్పగలవా..? నీ హాఫ్‌మైండ్‌తో సగం విని సగం వదిలేసి.. నీ తండ్రి రాసిచ్చిన స్క్రిప్టు చదవడాన్ని మానుకో...ఇష్టానుసారంగా వాగితే ప్రజలు చూస్తూ ఊరుకోరని నేను హెచ్చరిస్తున్నాను. 

లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లకు ఎమ్మెల్యేలుగా గెలిచే దమ్ముందా..?ః
మాయమాటలు చెప్పి ప్రజల్ని భ్రమల్లో నింపే చంద్రబాబు రాజకీయాల్ని ఈ రాష్ట్ర ప్రజలు చూసిచూసి అర్ధంచేసుకుని అలిసిపోయారు. ఇప్పుడు ఆయన కొడుకు లోకేశ్‌ కూడా బాబులానే తయారయ్యాడు. నోరుతెరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ.. మా గౌరవ ముఖ్యమంత్రి జగన్‌ గారిని ఇష్టానుసారంగా దూషిస్తున్నారు. కనీసం, గ్రామ సర్పంచిగా కూడా గెలవలేని లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లు కలిసి అత్యధిక ప్రజాదరణ కలిగిన, ఒంటిచేత్తో 151 మంది ఎమ్మెల్యేల్ని గెలిపించుకున్న మా ముఖ్యమంత్రిని విమర్శిస్తారా..? అసలు, మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకున్నారా..? మంగళగిరిలో ఓడిపోయినా మంత్రి పదవి వెలగబెట్టానని లోకేశ్‌ విర్రవీగుతున్నాడేమో.. అది తండ్రి కట్టబెట్టిన అధికారమని తెలుసుకోవాలి. దమ్ముంటే, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లు ఎమ్మెల్యేలుగా గెలవండి..చూద్దాం. అలాకాదని, మా ముఖ్యమంత్రిపై ఇష్టానుసారంగా నోరుపారేసుకుంటామంటే ప్రజలు చూస్తూ ఉండరని, తగిన బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరిస్తున్నాం. 

ఎస్సీఎస్టీలంతా జగన్‌గారి వెంటే..ః
ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలోనూ.. విడిపోయిన రాష్ట్రంలోనూ ఎస్సీఎస్టీలను పూర్తిగా విస్మరించి దూరంగా పెట్టిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే, ఆ రికార్డు ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది. ఆయన 2014 ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీలను అధికారంలోకి వచ్చాక నిలబెట్టుకోలేకపోవడంతోనే బాబును 2019లో ఓడించారు. పాదయాత్ర ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న దళితజాతి బిడ్డలందరికీ నేను అండగా ఉన్నాను అని మా జగన్‌ గారు భరోసా ఇచ్చారు. ఆ సందర్భంలో ప్రతీ ఒక్క దళిత బిడ్డ ఏమన్నాడో తెలుసా..? అయ్యా .. జగన్‌గారు ఆ చంద్రబాబు మోసాలకు ఇన్నాళ్లూ బలైపోయామని.. మీ నీడలో సేదతీరతామంటూ ఓట్లేసి వైఎస్‌ఆర్‌సీపీని గెలిపించారు. అధికారంలోకి రాగానే నాడు ఇచ్చిన ప్రతీ హామీని ఈరోజు నిలబెట్టుకున్నందునే దళిత కుటుంబాలన్నీ ఆయన వెంటే నడుస్తున్నాయి.  

బాబు కులరాజకీయాలకు చెల్లుచీటిః
చంద్రబాబుకు ఎన్నికలొస్తున్నాయనగానే రాష్ట్రంలో కులాల కుంపట్లు పెడదామనే ఆలోచనలొస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు విస్మరించిన కులాలన్నింటినీ మరలా తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాడు. వారి ఓట్లను దండుకోవాలనే దుర్భుద్ధితో టీడీపీలో ఉన్న కొంతమంది కుల నాయకులకు బిస్కెట్లు విసురుతున్నాడు. ఏనాడైనా ఎస్సీ ఎస్టీలకు మేలు చేసే పథకాన్ని ఒక్కటైనా చంద్రబాబు అమలు చేశాడని ఆయన చెప్పుకోగలడా..? ఎన్నికల మ్యానిఫెస్టో విషయానికొచ్చే సరికి ఆల్‌ఫ్రీ బాబు అవతారమెత్తుతాడు. ఉచితంగా ఇచ్చేవే కదా..అని ఇష్టానుసారంగా రాసుకోవడమేనని దాదాపు 650 పైగా హామీల్ని చెప్పి.. అధికారంలోకి వచ్చాక వాటిల్లో ఆరైనా నెరవేర్చలేని దరిద్రుడు ఈ చంద్రబాబు. గతంలో మాదిరిగా కులరాజకీయాలు చేయాలనుకోవడం బాబుకు వృథా ప్రయాసేనని చెబుతున్నాను. మా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్‌ గారు ఎన్నికల మ్యానిఫెస్టోను పవిత్రగ్రంథంగా చూసుకుంటూ ఇప్పటికే 99.5 శాతం హామీల్ని నెరవేర్చారు. 

వైనాట్‌ 175 అని అంటున్నామంటే..
మా నాయకుడు జగన్‌ గారు 2024 ఎన్నికల్లో వైనాట్‌ 175 అనడంలో తప్పేముంది..? టీడీపీతో పాటు మిగతా పార్టీలు ఎందుకంత ఫీల్‌ అవుతున్నాయి...? అధికారంలో ఉన్నప్పుడు కనీసం 20 శాతం పథకాల్ని కూడా అమలు చేయలేని పార్టీలు 150 స్థానాల్ని దక్కించుకోవాలని పోరాడుతున్నప్పుడు.. మ్యానిఫెస్టో హామీల్లో నాలుగేళ్లల్లో 99.5 శాతం నెరవేర్చి ప్రజల మద్ధతును కూడగట్టుకున్న మా జగన్‌ గారు ఈ రాష్ట్రంలోని 175 స్థానాలకు 175 స్థానాలూ వైఎస్‌ఆర్‌సీపీనే కైవసం చేసుకుంటుందని అనడంలో ఆశ్చర్యమేముంది..? చంద్రబాబులాగా మా నాయకుడు అబద్ధాలు చెప్పలేదు...తానేం చేయగలడో అదే చెప్పారు..అదే చేసి చూపించారు. ఇచ్చిన ప్రతీ మాట నిలబెట్టుకున్నారు కాబట్టే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ జగన్ గారిని ఆశీర్వదిస్తున్నారు. ఇప్పటికైనా మా జగన్‌ గారిపై ఇష్టానుసారంగా ఎవరైనా నోరుపారేసుకుంటే ప్రజల చేతుల్లో వారికి గుణపాఠం తప్పదని మేం హెచ్చరిస్తున్నాం.

Back to Top