డాక్టర్‌ సుధాకర్‌ టీడీపీ మనిషి

వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌
 

తాడేపల్లి: అనకాపల్లికి చెందిన మత్తు డాక్టర్‌ సుధాకర్‌ టీడీపీ మనిషని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ నందిగం సురేష్‌ పేర్కొన్నారు. దళితుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని విమర్శించారు. ఆదివారం తాడేపల్లిలోని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో నందిగం సురేష్‌ మీడియాతో మాట్లాడారు. నిన్న విశాఖలో సస్పెండ్‌కు గురైన డాక్టర్‌ సుధాకర్‌ తప్ప తాగి సీఎం, పోలీసులు, స్థానికులను తీవ్రభాషలో దుర్భాషలాడారన్నారు. సుధాకర్‌ 2019లో టీడీపీ తరఫున పాయకరావుపేట నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించారని, ఇందుకోసం తన డాక్టర్‌ పదవికి రాజీనామా కూడా చేశారన్నారు. ఆయనకు టికెట్‌ ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారని, తీరా ఇప్పుడు ప్రభుత్వంపై బురద జల్లేందుకు దళితుడైన సుధాకర్‌ను వాడుకుంటున్నారన్నారు. తప్ప తాగి సుధాకర్‌ చిందులు వేస్తే..దాన్ని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు అంటగట్టాలని చూస్తున్నారని, చంద్రబాబు పప్పులు ఉడికే పరిస్థితి లేదన్నారు.మీడియాకు అడ్డంగా దొరికిపోవడం టీడీపీకి అలవాటే అన్నారు. డాక్టర్‌ సుధాకర్‌ అనుచిత ప్రవర్తన నిన్న జరిగితే శుక్రవారమే  ఖండన అంటూ టీడీపీ పత్రికా ప్రకటన విడుదల చేసిందని తప్పుపట్టారు. దళితుల జీవితాలతో చంద్రబాబు ఆడుకుంటున్నారని విమర్శించారు. దళితులను నాశనం చేసింది చంద్రబాబే అని మండిపడ్డారు. కరోనా టెస్టుల్లో దేశంలోనే ఏపీ అగ్రస్థానంలో ఉందన్నారు.విపత్కర పరిస్థితుల్లోనూ ప్రతి పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. కుల రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని దుయ్యబట్టారు.దళితులకు విలువ లేకుండా చేయడమే చంద్రబాబు ఆలోచన అని నందిగం సురేష్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Back to Top