క‌ర్నూలులో హైకోర్టు పెట్టేందుకు నీవు వ్య‌తిరేకివి కాదా బాబూ? 

ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌
 

గుంటూరు: క‌ర్నూలులో హైకోర్టు పెట్టేందుకు తాను వ్య‌తిరేకం కాద‌న్న చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌ను వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. నిన్న క‌ర్నూలులో చంద్ర‌బాబు చేసిన కామెంట్లపై  మాజీ మంత్రి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ మండిప‌డ్డారు. కర్నూలులో రాజధానికి నేను వ్యతిరేకం కాదు అని మాట్లాడుతున్నచంద్రబాబు రాయలసీమ ప్రజలను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కర్నూలు రాజధానికి వ్యతిరేకంగా చంద్రబాబు మాట్లాడిన సాక్షాలు ఎన్నో వున్నాయ‌న్నారు. రాజధాని అమరావతిలో చంద్రబాబు రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది.. దానిని నిలబెట్టుకోవడం కోసం అడ్డగోలుగా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని మోపిదేవి కీలక వ్యాఖ్యలు చేశారు.
 
తన బినామీలు ఏజంట్లతో చంద్రబాబు పాదయాత్రను ప్రారంభించాడు. హైకోర్టు కూడా పాదయాత్ర సరైన విధానం కాదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్ధించింది. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పరిపాలనలో పనిచేస్తున్న ఎమ్మెల్యే లు, ఎంపీ లు అందరూ కూడా ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. ఎమ్మెల్యేలపై చంద్రబాబు చేసిన మాటలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. చంద్రబాబు మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎంపీ మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ అన్నారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top