గుంటూరు: రాష్ట్రంలోని ఏ పేదవాడు కూడా వైద్యానికి ఇబ్బంది పడకూడదని వైయస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ఇందుకోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి వైద్య రంగంలో సమూల మార్పులు చేస్తున్నారని పేర్కొన్నారు.ప్రతి మండలానికి 104, 108 వాహనాలను అందించిన ఘనత సీఎం వైయస్ జగన్‌దే అన్నారు. వైద్యరంగానికి సీఎం వైయస్ జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను జాతీయ, అంతర్జాతీయ మీడియా కూడా గొప్పగా వార్తలు రాస్తున్నాయని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని మోపిదేవి వివరించారు.