పోలవరం, విశాఖ ఉక్కు కోసం పార్లమెంట్‌లో పోరాడుతాం

 వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి 

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు కేటాయించాలని, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  పార్లమెంట్‌లో పోరాడుతామని వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి తెలిపారు.  సోమవారం లోక్‌సభ బీఏసీ సమావేశానికి వైయస్‌ఆర్‌సీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర సమస్యలను ప్రస్తావించేందుకు అధిక సమయం ఇవ్వాలని కోరారు. లోక్‌సభ స్పీకర్‌ సానుకులంగా స్పందించారని ఎంపీ తెలిపారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానికి సీఎం వైయస్‌ జగన్‌ లేఖ రాశారని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఎంపీలందరం కేంద్ర మంత్రులను కలిశామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులన్నీ కేంద్రమే భరించాలన్నారు. సవరించిన అంచనాలను ఆమోదించాలని బీఏసీ సమావేశంలో కోరినట్లు మిథున్‌రెడ్డి తెలిపారు. 
 

తాజా ఫోటోలు

Back to Top