లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌గా ఎంపీ మిథున్‌రెడ్డి

న్యూఢిల్లీ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి తాజాగా లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ సభకు హాజరుకాలేని సమయంలో ప్యానల్‌ స్పీకర్‌ లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహిస్తారు.రాజంపేటలో లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి విజయం సాధించారు. 2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు.

Back to Top