కుప్పం ప్రజలను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు

ఎంపీ మిథున్‌ రెడ్డి 
 

చిత్తూరు: సొంత నియోజకవర్గం కుప్పం ప్రజలను టీడీపీ అధినేత చంద్రబాబు దారుణంగా మోసం చేశారని వైయ‌స్ఆర్‌ సీపీ ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలనలో కుప్పంలో బాగుపడింది కేవలం ఐదుగురు మాత్రమేనని... ఆ ఐదుగురే పెద్దపెద్ద బంగ్లాలు కట్టుకున్నారని అన్నారు. ప్రజలకు కనీసం తాగునీరు కూడా అందించలేదని విమర్శించారు. త్వరలోనే కుప్పంలో 10 వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో కుప్పం ప్రజల ఆశీర్వాదాలు వైయ‌స్ఆర్‌ సీపీకి కావాలని కోరారు.
 రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ సుపరిపాలన అందిస్తుంటే చంద్రబాబు ఓర్చుకోలేకపోతున్నారని విమర్శించారు. పేదలకు ఇళ్లు ఇస్తుంటే చంద్రబాబు అసహనానికి గురవుతున్నారని... కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని దుయ్యబట్టారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top