ఆఫ్ఘాన్‌లోని తెలుగువారిని క్షేమంగా తీసుకురావాలి

అఖిలపక్ష సమావేశంలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి

ఢిల్లీ: అఫ్ఘాన్‌లో చాలామంది తెలుగువారు పనిచేస్తున్నారని, వారందరినీ క్షేమంగా తీసుకురావాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి కోరారు. ఆఫ్ఘానిస్థాన్‌లో పరిణామాలపై నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున ఎంపీ మిథున్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మిథున్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని వ్యూహాలను రూపొందించాలన్నారు. ప్రతి అంశంలోనూ ఆచితూచి వ్యవహరిస్తామని విదేశాంగ మంత్రి చెప్పారని ఎంపీ మిథున్‌రెడ్డి వివరించారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top