త్వరలోనే కోనసీమ అల్లర్ల కేసు ముగింపు

ఎంపీ మిథున్‌రెడ్డి
 

కాకినాడ జిల్లా: త్వరలోనే అమలాపురం అల్లర్ల కేసుకు ముగింపు పలుకుతామని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ రీజిన‌ల్‌ కో-ఆర్డినేటర్‌, ఎంపీ మిథున్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘కొద్దిరోజుల కిందట మంత్రి విశ్వరూప్‌, ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌.. సీఎం వైయ‌స్‌ జగన్‌ను కలిశారు. అల్లర్ల కేసులో కొందరు అమాయకుల పేర్లు ఉన్నాయని, దీనివల్ల యువత భవిష్యత్తు పాడవుతుందని సీఎంకు వివరించారు. వారిపై నమోదైన కేసులను ఉపసంహరించాలని కోరార‌ని మిథున్‌రెడ్డి వెల్లడించారు.

Back to Top