ఇచ్చిన మాట నిలబెట్టుకునే దమ్మున్న నాయకుడు మన సీఎం

సీఎం వైయస్‌ జగన్‌ పాలన రామరాజ్యాన్ని తలపిస్తోంది

పెరిగిన పెన్షన్‌ రూ.2750 అందుకొని అవ్వాతాతలు ఆనందపడుతున్నారు

అవ్వాతాతల దీవెనలు సీఎం వైయస్‌ జగన్‌కు ఎల్లప్పుడూ ఉండాలి

రాజమండ్రిలో పెన్షన్‌ వారోత్సవాల సభలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌

రాజమండ్రి: పట్టువదలని విక్రమార్కుడిలా తండ్రి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ.. ప్రజలకు ఇచ్చిన మాటలను నిలబెట్టుకుంటున్న దమ్మున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. 1వ తేదీన నూతన సంవత్సరం పండుగ, 2వ తేదీన తెలుగువారందరి పండుగ వైకుంఠ ఏకాదశి, 3వ తేదీన అవ్వాతాతల పండగను జరుపుకోవడానికి రాజమహేంద్రవరం వచ్చిన సీఎం వైయస్‌ జగన్‌కు ప్రజలందరి తరఫున కృతజ్ఞతలు తెలిపారు. రాజమండ్రిలో జరుగుతున్న పెన్షన్‌ వారోత్సవాల్లో ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడారు. 

దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి అకాలమరణంతో దుష్టశక్తులు ఏరకంగా ఏకమై ఒక వ్యక్తిపై ఏరకంగా కుట్రలు చేశారో మనమంతా చూశాం. నాడు ప్రజలకు ఇచ్చిన మాట కోసం ఢిల్లీ కోటను వైయస్‌ జగన్‌ ఢీకొట్టారు. నేడు ప్రజలందరికీ సంక్షేమ పాలనను అందిస్తున్నారు. ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ప్రేమగా పలకరించే ముఖ్యమంత్రిని ఆనాడు స్వర్ణయుగంలో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ను చూశాం. ఇప్పుడు మనకళ్ల ముందు సీఎం వైయస్‌ జగన్‌ను చూస్తున్నాం. వైయస్‌ జగన్‌ పాలన రామరాజ్యాన్ని తలపిస్తోంది.  

గతంలో చంద్రబాబు హయాంలో పింఛన్‌ కేవలం రూ.1000 ఇచ్చేవారు. అది కూడా కేవలం 39 లక్షల మందికి మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం సీఎం వైయస్‌ జగన్‌ ప్రభుత్వంలో రూ.2750 పెన్షన్‌ అందజేస్తున్నారు. సుమారు 64 లక్షల మందికిపైగా పెన్షన్‌ లబ్ధిదారులు ఉన్నారు. పింఛన్లపై చంద్రబాబు, ఎల్లోమీడియా ఏరకంగా  దుష్ప్రచారం చేస్తున్నారో అంతా చూస్తున్నాం. ఇచ్చిన మాటకు కట్టుబడి ఏటా వైయస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకను పెంచుతూ పోతున్నారు. గత సంవత్సరం రూ.2500 ఉన్న పెన్షన్‌ ఈ ఏడాది రూ.2750కి సీఎం వైయస్‌ జగన్‌ పెంచారు. అవ్వాతాతల చల్లని దీవెనలు ఎల్లప్పుడూ సీఎం వైయస్‌ జగన్‌కు ఉండాలి. 

ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ చంద్రబాబు బూర ఊదినప్పుడు మాత్రమే బుట్టలోంచి బయటకు వచ్చి బుసలు మాత్రమే కొడుతున్నాడు. సొంతపుత్రుడు లోకేష్‌ పగటి పూట పుష్పరాజ్‌లా ఉంటాడు. ఏం మాట్లాడుతాడో తెలియదు.. ఏం మాట్లాడాలో కూడా తెలియదు. మిడిమిడి జ్ఞానంతో ఉన్న లోకేష్‌ చేతిలో, ప్యాకేజీలు తీసుకునే దత్తపుత్రుడి చేతుల్లో మన రాష్ట్రాన్ని పెడతామా.. అస్సలు పెట్టం. పేదలు, బడులు, బలహీనవర్గాల గురించి ఆలోచించే వ్యక్తి, మనసున్న మహరాజు సీఎం వైయస్‌ జగన్‌ చేతిలో మన రాష్ట్రాన్ని ఎల్లప్పుడూ ఉంచాలని కోరుకుంటున్నాను. వై నాట్‌ 175 అని సీఎం వైయస్‌ జగన్‌ పిలుపునిచ్చారు.. ఆ పిలుపును మన రాజమహేంద్రవరం నుంచి ఆచరణలో చూపిద్దాం. 

ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజమండ్రికి రూ.125 కోట్లు స్పెషల్‌ గ్రాంట్‌గా ఇచ్చారు. వాటితో క్రికెట్‌ స్టేడియం, ఇండోర్‌ స్టేడియం, మోరంపూడి ఫ్లైఓవర్, ఇతర అభివృద్ధి పనులు పూర్తిచేసుకుందాం’’ అని ఎంపీ మార్గాని భరత్‌ అన్నారు. 
 

Back to Top