సామాజిక న్యాయం జగనన్నతోనే సాధ్యం

తిరుపతి ఎంపీ గురుమూర్తి

నెల్లూరులో సామాజిక న్యాయ బ‌స్సు యాత్ర సన్నాహాక స‌మావేశం

నెల్లూరు: దళితులకు సామాజిక న్యాయం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితోనే సాధ్యమ‌వుతుంద‌ని తిరుపతి ఎంపీ గురుమూర్తి అన్నారు. ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ బస్సు యాత్ర జరగనున్న నేపథ్యంలో  ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలకి సంబందించిన సన్నాహాక సమావేశం బుధ‌వారం నెల్లూరు కస్తూరిభా పాఠశాల ఆవరణంలోని రవీంద్రనాధ్ ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించారు.  

ఈ సందర్భంగా గురుమూర్తి మాట్లాడుతూ.. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దళితులందరూ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని అందుకు కారణం గౌరవ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే అన్నారు. రాజకీయ పదవులలో ప్రాధాన్యం లాంటి ఎన్నో మేళ్లను పొందడమే కారణమని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి లాంటి ఎన్నో కార్యక్రమాలు నేడు కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా అమలవుతున్నాయని ఇవి ఇలాగే కొనసాగాలి అంటే మరోసారి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్‌ రెడ్డి ని ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు.  

 సమాజంలో దళితులు గౌరవంగా బతికేలా ఏపీ సీఎం వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి పాల‌న కొన‌సాగిస్తున్నార‌ని  మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. ప్రజల కోసం కష్టపడే సీఎం వైయ‌స్‌ జగన్‌ను వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దళితుల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించేందుకే సామాజిక న్యాయ చైతన్య యాత్రని నిర్వహిస్తున్నామని మంత్రి నాగార్జున తెలిపారు. 

రాష్ట్రంలో దళిత, గిరిజనుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గన్ అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దళితుల కోసం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించేందుకే సామాజిక న్యాయ చైతన్య యాత్రని నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ పథకాలలో అవినీతి లేకుండా దళితులకు అందిస్తున్నారు. దళితులు గౌరవంగా బతికేలా చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయ‌స్ జగన్‌ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంద‌ని అన్నారు.

 
‘సామాజిక బస్ యాత్రలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు మోసాలను ఎండగడతామ‌ని మంత్రి తెలిపారు. అందరూ సీఎం వైయ‌స్ జగన్‌కు అండగా ఉండాలి. గతంలో దళితులు తమ పథకాల కోసం లంచాలు ఇవ్వాల్సి వచ్చేది. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో దళితులపై దాడులు ఎక్కువగా జరిగాయి. దళితుల గురించి ఆయన ఏనాడూ పట్టించుకోలేదు. మన సీఎం వైయ‌స్ జగన్ దళితులకు అండగా నిలుస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయ‌స్ఆర్‌ సీపీని గెలిపించుకుందామ‌ని మంత్రి మేరుగ నాగార్జున పిలుపునిచ్చారు.

 కార్యక్రమంలో  ఎమ్మెల్యేలు కిలివేటి సంజీవయ్య, వెలగపల్లి వరప్రసాద రావు, ఎమ్మెల్సీ మేరుగ మురళి, బల్లి కళ్యాణ్, మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్సీ, షెడ్యూల్ కులాల కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

Back to Top