నూటికి నూరు శాతం ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేశారు

ఇది రాజకీయ కుట్ర : ఎంపీ గోరంట్ల మాధవ్‌

ఏబీఎన్‌ రాధాకృష్ణ ఓ బ్రోకర్‌
 
నీచ రాజకీయాలకు చంద్రబాబు ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలి

 న్యూఢిల్లీ:  నూటికి నూరు శాతం ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేసి తప్పుడు ప్రచారం చేశారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ మండిపడ్డారు. నేను కడిగిన ముత్యంలాగే బయటకు వస్తానని తెలుసునని, పోలీసుల విచారణలో  అది ఫేక్‌ వీడియో అని రుజువైందని చెప్పారు. ఇది రాజకీయ కుట్ర అని ధ్వజమెత్తారు. ప్రత్యర్థుల కుట్ర భగ్నమైంది. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను బద్నాం చేయాలనే ప్రయత్నం బెడిసి కొట్టింది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన వీడియో ఒరిజినల్‌ కాదని, ఫేక్‌ అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ప్రకటించారు.  సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో ఒరిజినల్‌ కాదని, ఫేక్‌ అని చెప్పారు. ఆ వీడియో మార్ఫింగ్‌ లేదా ఎడిటింగ్‌ జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ వీడియోను చూస్తున్న విజువల్స్‌ను.. వీడియో తీసి పోస్ట్‌ చేశారు అని ఆయన వెల్లడించారు. వీడియోను మార్ఫింగ్‌ చేసినట్లు ఎంపీ అనుచరులు ఫిర్యాదు చేశారని తెలియజేశారు. ఈ మేరకే దర్యాప్తు చేపట్టామని అన్నారు. ఈ అంశంపై ఎంపీ  మీడియాతో మాట్లాడారు.

ఇది మార్ఫింగ్‌ వీడియో అని ఆ రోజే చెప్పా..వందశాతం టీడీపీ నేతలు ఒక ఫేక్‌ వీడియోను క్రియేట్‌ చేశారని ముందు నుంచి చెబుతున్నానని తెలిపారు. నిందితులు కచ్చితంగా దొరికిపోతారని, శిక్షింపబడుతారని ఆ రోజే చెప్పానని గుర్తు చేశారు. ఒక డెప్త్‌ టెక్నాలజీని వాడి ఇలాంటి ఫేక్‌ వీడియోలు సృష్టించారని, కొంత మంది దుర్మార్గులు చేసిన పని అని పేర్కొన్నారు. టీడీపీ చరిత్ర నీచమైందని విమర్శించారు. చంద్రబాబు నీ కళ్లు కనపడటం లేదా అని నిలదీశారు. ఇలాంటి నీచమైన చర్యలతో నీ పార్టీ బతకదని మండిపడ్డారు. తెలుగు దేశం పార్టీ నికృష్టపు ఆలోచనలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చే శారు. ఏబీఎన్‌ రాధాకృష్ణ ఓ బ్రోకర్ అని దుయ్య‌బ‌ట్టారు. చంద్రబాబు తీరు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. ఎక్కడ స్తీ్రలు పూజింపబడుతారో? ఎక్కడ స్త్రీ్రలు గౌరవించబడుతారో ఎక్కడ స్తీ్రలకు ఆర్థిక భద్రత, సామాజిక భద్రత ఉంటుందో అక్కడ దేవతలు ఉంటారని నమ్మిన పార్టీ మా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అని స్పష్టం చేశారు. అలాంటి పార్టీలో ఉన్న నేను క్రమశిక్షణతో ఉంటానని రాష్ట్ర ప్రజలకు ఎంపీ తెలిపారు. తాను కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాననే విశ్వాసం ఉందని, అదే రుజువైందన్నారు.  తనకు మద్దతు తెలిపిన వారందరికీ గోరంట్ల మాధవ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇక ఈ రాద్ధాంతానికి ఫుల్‌స్టాఫ్‌ పెట్టాలని హితవు పలికారు. ఇకనైనా నీ నీచ రాజకీయాలు మానుకోవాలని సూచించారు. ఫేక్‌ వీడియోలు క్రియేట్‌ చేసిన నేరస్తులను అందరిని బయటకు తీసుకురావాలని పోలీసులను ఎంపీ కోరారు. తనపై తప్పుడు ప్రచారం చేసిన వారిని శిక్షించాలని న్యాయపరంగా పోరాటం చేస్తానని ఎంపీ గోరంట్ల మాధవ్‌ పేర్కొన్నారు.
చంద్రబాబు ఏడేళ్ల క్రితం ఓటుకు కోట్లు కేసులో రెడ్‌హ్యాండెండ్‌గా దొరికాడు. ఆయన నిజాయితీపరుడైతే తన వీడియోను ఫోరెక్స్‌ ల్యాబ్‌కు ఇచ్చి రుజువు చేసుకోవచ్చు కదా అన్నారు. టీడీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల వ్యతిరేక పార్టీ అన్నారు. వెనుకబడిన వర్గాలు ఎదుగుతే ఓర్వలేని పార్టీ టీడీపీ అన్నారు.  చంద్రబాబు పాలనలో కత్తులతో నరికి, తుపాకులతో కాల్చి చంపారు. టీడీపీ హాయంలో జరిగిన నేరాల్లో ఒక్క కేసుపైనైనా శిక్షలు పడ్డాయా అని ప్రశ్నించారు. తాను తప్పు చేసినట్లు తేల్చాలని పోలీసులకు ఎంపీ కోరారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top