అనంతపురం:నిన్న రాష్ట్రపతిని కలిసిన టీడీపీ ఎంపీల్లో ఒక ఆయన ఆస్తులు కాపాడుకోవడానికి.. మరొకాయన చిన్నన్నాను కాపాడుకోవడానికి కలిసినట్లు ఉందని వైయస్ఆర్‌సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. టీడీపీ ఎంపీలు రాష్ట్రపతిని కలవడంపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. రాష్ట్రపతికి కరోనా అంటించడానికి చంద్రబాబు ఎంపీలను పంపారని విమర్శించారు. అసత్యాలతో తప్పుడు నివేదికను రాష్ట్రపతికి సమర్పించారన్నారు. నిధుల వినియోగంలో రాష్ట్ర ప్రభుత్వం నిజాయితీగా నిక్కచ్చిగా వ్యవహరిస్తోందన్నారు. పోలీసుల విచారణలో నేరం రుజువై కోర్టు అనుమతితోనే ఎవరినైనా జైల్లో పెడతారని గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి అచ్చెన్నాయుడు, ఇతరుల కేసులకు ఎటువంటి సంబంధం లేదన్నారు. గల్లా జయదేవ్ ఆస్తులు ఏ రకంగా కూడబెట్టారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్తులను ఏ రకంగా దుర్వినియోగం చేశారో అందరికీ తెలుసన్నారు.