ఉచిత కోవిడ్‌ వ్యాక్సిన్ల పంపిణీకి ఎంపీల చేయూత

విజ‌య‌వాడ‌:  రాష్ట్రంలోని 18-45 ఏళ్ల వ‌య‌స్సు గ‌ల వారికి ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్ వేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీసుకున్న నిర్ణ‌యానికి ప్ర‌శంస‌లు వెల్లువెత్తున్నాయి. అంతేకాకుండా ప‌లువురు టీకా పంపిణీకి విరాళాలు అంద‌జేస్తూ త‌మ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు కూడా విరాళాలు అంద‌జేస్తున్నారు. శ‌నివారం వైయస్ఆర్ సీపీ ఎంపీ బాల‌శౌరి ఉచిత కోవిడ్ టీకా పంపిణీకి త‌న వంతుగా రూ.20 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. కాగా, రాష్ట్రంలో మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వ‌య‌సు గ‌ల వారంద‌రికీ ఏపీ ప్ర‌భుత్వం ఉచిత వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌కు శ్రీ‌కారం చుట్ట‌నుంది.‌

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top