మచిలీపట్టణం- ధర్మవరం ఎక్స్ ప్రెస్ రైలును పునః ప్రారంభిచాలి

కేంద్ర రైల్వే మంత్రిని కోరిన ఎం.పి. బాలశౌరి 

న్యూఢిల్లీ: మచిలీపట్టణం నుంచి ధర్మవరంఎక్స్ ప్రెస్ రైలును వెంటనే పునః ప్రారంభిచాలని కేంద్ర రైల్వే మంత్రిని మ‌చిలీప‌ట్నం వైయ‌స్ఆర్‌సీపీ ఎం.పి. బాలశౌరి కోరారు. శ‌నివారం  జరిగిన పార్లమెంట్ సమావేశాలలో రూల్ 377 కింద తిరుపతి రైలు గురించి మచిలీపట్టణం ఎం.పి. బాలశౌరి మాట్లాడుతూ.. రైల్వే బోర్డ్ వారు మచిలీపట్టణం నుండి తిరుపతి మీదుగా ధర్మవరం పోవు రైలు నెంబర్ 17245 & 17246 ను రద్దు చేశారని, ఇది మచిలీపట్టణం ప్రాంతంలోని  ప్రజల డిమాండ్ మేరకు 2007 సంవత్సరం నుండి నడుస్తున్నదని, అప్పటి నుండి ఈ రైలు మచిలీపట్టణం, పరిసర ప్రాంత  ప్రజల అవసరాలను తీరుస్తున్నదని వివరించారు.
     ప్రస్తుతం ఒకఎక్స్ ప్రెస్  రైలు నర్సాపురం నుంచి తిరుపతి మీదుగా ధర్మవరంకు వెళుతూ, గుడివాడ వద్ద  మచిలీపట్టణం నుండి  వచ్చు ప్రయాణీకులను ఎక్కించుకొని తిరుపతి మీదుగా ధర్మవరం తీసుకు వెళుతుంది. ఈ రైలుకు అనుసంధానించడం కోసం ఒక పాసెంజర్ రైలు ను మచిలీపట్టణం నుండి గుడివాడకు నడుపుతున్నారు. ఇందువలన తిరుపతి వెళ్ళే ప్రయాణీకులు, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణి స్త్రీలు, చిన్న పిల్లలున్న తల్లులు, వారి యొక్క సామాను మోసుకుంటూ , వేరొక రైలు లోకి మారడం కారణంగా చాలాఇబ్బందులకు గురవుచున్నారు. కేవలం మచిలీపట్టణం నుండి తిరుపతి మీదుగా  ధర్మవరం వెళ్ళే రైలు ను రద్దు చేయడం కారణం గానే ఈ పరిస్థితి తలయెత్తింది. మచిలీపట్టణం నుండి తిరుపతి పోవు భక్తుల మనోభావాలను గుర్తించి, రద్దు చేసిన రైలును పున‌రుద్ధ‌రించాల‌ని ఎంపీ బాల‌శౌరి కోరారు. 

తాజా వీడియోలు

Back to Top