వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ, ఎమ్మెల్యే దాతృత్వం

పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ
 

 
వైయస్‌ఆర్‌ జిల్లా : లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేసి దాతృత్వం చాటుకున్నారు. వైయస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగు మండలం గొరిగెనూరు, ధర్మాపురం గ్రామాల్లో ఇంటింటికి 13వస్తువులతో కూడిన ప్యాకెట్లను ఎంపీ, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పంపిణీ చేశారు. మండలంలోని 14 గ్రామాల్లో 14వేల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేశారు. 

ఎవరూ ఆందోళనకు గురికావద్ద
కరోనా నేపథ్యంలో ఎవరూ ఆందోళనకు గురికావొద్దని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించి వైరస్‌ను తరిమికొట్టాలని వైయస్‌ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. గొరిగెనూరు గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి గ్రామంలోని పేదలు ఇబ్బంది పడుతున్నారని సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గ్రామానికి వచ్చి నిత్యావసరాలు పంపిణీ చేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top