పేద, మధ్యతరగతి ప్రజల పక్షపాతి సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి

నెల్లూరులో రాష్ట్ర మంత్రులు కాకాని, ఆదిమూలపు లతో కలసి టీడ్కో గృహాలను ప్రారంభించిన ఎంపీ ఆదాల  

15 500 టీడ్కోగృహాల తాళాలను లబ్ధిదారులకు పంపిణీ

సొంత ఇంటి కల నెరవేర్చిన సీఎం జగనన్నకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు

 జాతర మహోత్సవముల సాగిన టీడ్కోఇళ్ళు పంపిణీ కార్యక్రమం

నెల్లూరు:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేద, మధ్యతరగతి ప్రజల పక్షపాతి అని నెల్లూరు ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి అన్నారు. మంచి చేసే ముఖ్యమంత్రి కావాలా...?? అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే ముఖ్యమంత్రి కావాలో...?? ప్రజలు ఆలోచించాల‌ని సూచించారు. వచ్చే ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌సీపీని ఆదరించాలని ఎంపీ ఆదాల పిలుపునిచ్చారు. నెల్లూరులో రాష్ట్ర మంత్రులు కాకాని, ఆదిమూలపు లతో కలసి టీడ్కో గృహాలను ఎంపీ ఆదాల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ప్రారంభించారు. 15,500 టీడ్కోగృహాల తాళాలను లబ్ధిదారులకు అంద‌జేశారు. రానున్న ఎన్నికల్లో నెల్లూరు రూరల్ నుండి ఆదాల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి మంత్రులు ఆదిమూలపు, కాకాని, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి  పిలుపునిచ్చారు.  

Back to Top